ఒకప్పుడు యువత ఆదరణను చూరగొన్న హాట్‌మెయిల్ వ్యవస్థాపకుడైన సమీర్భాటియా, అమెరికాలో ఉద్యోగం చేసిఇండియా తిరిగొచ్చిన యోగేష్ బన్శ్వాల్ ఈ మధ్యనే ఒక వెబ్సైట్ను రూపొందించారు. అదే అప్నాసర్కిల్.కామ్.

సోషల్ నెట్ వర్క్ వెబ్‌సైట్లలాగే మీ ప్రొఫైల్‌ను కంపోజ్ చేసి లాగిన్ అవ్వాలి. మీ చదువు, నైపుణ్యాలు, అనుభవం.. పేర్కొనాలి. నౌక్రీ, మాన్‌స్టర్ జాబ్‌సైట్లలో మీ వివరాలు పొందుపరిచినట్లే.. అప్నాసర్కిల్.కామ్‌లో కూడా పొందుపరచాలి. మీ అర్హత, నైపుణ్యాలకు తగ్గట్టు ఉద్యోగాలు ఉంటే.. మీకు తప్పక ఎస్‌ఎంఎస్ వస్తుంది. మీతోపాటు మీ మిత్రులకు కూడా ఇదే ఎస్‌ఎంఎస్ పంపించే వెసులుబాటు ఇందులో ఉంది. తరచూ జాబ్‌సైట్లలో ఉద్యోగాలు వెతికేబదులు.. ఇలాంటి ఏర్పాటు చేసుకుంటే ఎంతో ప్రయోజనం ఉంటుందని నిరుద్యోగులు భావిస్తున్నారు.
నోయిడా ప్రాంతం నుంచి తమ సేవలు అందిస్తున్నారు. ఇప్పుడిప్పుడే నిరుద్యోగ యువతను ఆకర్షిస్తున్న ఈ వెబ్‌సైట్ రానున్న కాలంలో వేగం పుంజుకొనే అవకాశం ఉంది. ప్రస్తుత మాంద్యం తొలగిపోయి ఆయా కంపెనీల రిక్రూట్‌మెంట్లు వేగవంతం అయితే.. దేశవ్యాప్తంగా అందరికీ ఎస్‌ఎంఎస్‌లను పంపిస్తూ అప్నాసర్కిల్.కామ్ బిజీ అవుతుందేమో! చూడాలిమరి.సైట్ లింక్: http://www.apnacircle.com
మీకు తెలిసిన నిరుద్యోగులకు కూడా తెలియజేసి వారి ఉద్యోగ ప్రయత్నానికి సహయపడండి.
అన్నట్లు మీరు లాగిన్ అవుతున్నారా! అయితే మీకు కూడా

పూర్తిగా చదవటానికి క్లిక్ చేయండి...


