ఫ్యాషన్ డిజైనింగ్

మిత్రులారా... మ్యాటర్ ను టైప్ చేయుటకు టైమ్ లేనందున ఫైల్ను పెడుతున్నాను.
క్లిక్ చేసి చదవండి.

క్లిక్
పూర్తిగా చదవటానికి క్లిక్ చేయండి...

9 నెలల్లో 900 ఉద్యోగాలు: యెస్‌ బ్యాంకు

ఈ ఆర్థిక సంవత్సరంలో రుణాల్లో 40 శాతం వృద్ధిని సాధించే లక్ష్యంతో యెస్‌ బ్యాంకు ఉద్యోగ నియామక కార్యక్రమంలో నిమగ్నమైంది. వచ్చే 9 నెలల్లో మొత్తం 900 మందిని నియమించుకోవాలని భావిస్తున్నట్లు బ్యాంకు ఒక ప్రకటనలో పేర్కొంది. 'ఈ ఆర్థిక సంవత్సరంలో 900 మందిని తీసుకుంటాం. ప్రస్తుతం మేం 2700 మంది ఉద్యోగులమున్నాం. మార్చి 2009 కల్లా ఈ సంఖ్యను 3600కు పెంచుతామ'ని బ్యాంకు ఎండీ, సీఈఓ రాణా కపూర్‌ పీటీఐకి తెలిపారు. 900 మందిలో 500 మంది మేనేజర్ల స్థాయి కాగా మిగతా 400 మందిని రిటైల్‌ సేవలు, విక్రయాల విభాగంలో తీసుకోనున్నట్లు ఆయన వివరించారు. అగ్రి-బిజినెస్‌, మౌలిక, ఇంధన, ఆరోగ్య సంరక్షణ, కమ్యూనికేషన్స్‌ వంటి రంగాల్లో తమ దృష్టిని కేంద్రీకరిస్తామని ఆయన తెలిపారు.

ఈనాడు, 20-6-09

పూర్తిగా చదవటానికి క్లిక్ చేయండి...

ఇంటర్వ్యూకు వెళుతున్నారా! అయితే ఈ టిప్స్ తప్పక పాటించండి.

మీరు జాబ్ కోసం ఇంటర్వ్యూకు వెళుతున్నారా!
అయితే మీరు కొన్ని టిప్స్ తెలుసుకోవాల్సిందే...

  • మీకు ఇంటర్వ్యూ నిర్వహించే కంపెనీ చిరునామాను స్పష్టంగా తెలుసుకోండి. ఒక రోజు ముందే ఈ సమాచారాన్ని సేకరిస్తే.. మీపై ఒత్తిడి ఉండదు.
  • ఇంటర్వ్యూకు ఏ మాత్రం ఆలస్యంగా వెళ్లకండి. హడావుడిగా వెళితే ఒత్తిడి పెరుగుతుంది. మనసు కుదుటగా ఉండదు. మీ సమాధానాలలో తప్పులు దొర్లే ప్రమాదం ఉంది.
  • ఇన్‌సర్ట్‌ చేసుకోకుండా వెళ్లకండి. ఇన్‌ఫార్మల్‌ దుస్తులను అసలే వేసుకోకండి. అవసరమైన ఉద్యోగాలకు టై తప్పనిసరి. బ్లాక్‌ షూ ధరించండి.
  • ఇంటర్వ్యూకు ముందుగానే సర్టిఫికెట్లను సర్దుకోండి. కొన్ని జిరాక్స్‌ కాపీలు దగ్గర ఉంచుకోండి. ఒక పెన్ను, ప్యాకెట్‌ నోట్‌ బుక్‌ పెట్టుకోండి. కాల్‌లెటర్‌ తీసుకుపోవడం మరిచిపోకండి.
  • కంపెనీకి వెళ్లాక.. ఒకసారి రీఫ్రెష్‌ అవ్వండి. తలదువ్వుకొని దుస్తులు సరిచేసుకోండి. రెండు గ్లాసుల మంచినీళ్లు తాగండి.
  • మీరు వెళ్లిన కంపెనీలో మీ మిత్రుడు ఉంటే.. ఇంటర్వ్యూ పూర్తి కాకుండానే ముచ్చట్లు పెట్టుకోకండి. ఉద్యోగం వస్తుందో రాదోనన్న సందిగ్ధంలోకి వెళ్లకండి.
  • ఫలానా ఉద్యోగానికి ఇంటర్వ్యూకు వచ్చినట్లు.. ఫ్రంట్‌ ఆఫీస్‌ ఎగ్జిక్యూటివ్‌కు చెప్పండి. ఆమె అడిగిన ప్రాథమిక వివరాలను తడబాటు లేకుండా చెప్పండి.
  • కంపెనీలకు వెళ్లే హడావుడిలో సెల్‌ఫోన్‌ స్విచాప్‌ చేయకపోతే.. ఇంటర్వ్యూ సభ్యులు తీవ్రంగా పరిగణిస్తారు. ఇంటర్వ్యూ సమయమంతా బాగా పూర్తయినా.. ఆఖర్న ఫోన్‌ రింగ్‌ వినిపిస్తే మాత్రం.. మీకు నష్టమే.
  • ఇంటర్వ్యూ పూర్తయ్యాక.. ఫలితం కోసం ఆరా తీయకండి. మీ వివరాలన్నీ రెజ్యూమెలో భద్రంగా ఉంటాయి. మీరు సెలెక్ట్‌ అయితే కంపెనీ తప్పక సమాచారం చేరవేస్తుంది.
టిప్స్ ను మీరు తప్పక పాటిస్తే మీరు జాబును వరించడం కాదు, జాబ్ మిమ్మల్ని వరిస్తుంది.

Time Warner Cable


పూర్తిగా చదవటానికి క్లిక్ చేయండి...

మీకు దర్శకత్వం చేయాలని ఉందా! యాకరింగ్ చేయాలని ఉందా?

క్లిక్ చేయండి.



పూర్తిగా చదవటానికి క్లిక్ చేయండి...

పదిలక్షల ఉద్యోగాలు మీ కోసం

స్టాక్మార్కెట్లో అత్యధికంగా ఇన్వెస్ట్చేసే రాష్ట్రాలలో మహారాష్ట్ర, గుజరాత్ముందున్నాయి. ఒకప్పుడు సంపన్న వర్గాలకేపరిమితమైన పెట్టుబడులు.. రానురాను విస్తరిస్తున్నాయి. షేర్ల లావాదేవీలలో తాజాగా ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, ఢిల్లీ ఊపందుకున్నాయి. మదుపరుల చైతన్యం కూడా బాగా పెరిగింది. జోరుతో రానున్న 5 ఏళ్ల్లలోసెన్సెక్స్‌ 30 వేలు దాటినా ఆశ్చర్యం లేదు. అమెరికాకు చెందిన ఒక క్యాపిటల్రీసెర్చ్కంపెనీ ప్రకారం 15 ఏళ్లలో సెన్సెక్స్లక్ష పాయింట్లకు చేరుకుంటుందని అంచనా. గణాంకాలను పరిశీలిస్తే క్యాపిటల్‌, ఫైనాన్సియల్మార్కెట్లో ఉద్యోగఅవకాశాలు పుష్కలం. ఇది వరకు ఐటీ బూమ్ను తలదన్నే రీతిలో ఫైనాన్సియల్రంగం దూసుకెళ్లడం ఖాయం.‌‌ ‌ ‌ ‌

బ్యాన్కులకు
కొత్త శోభ
ఇప్పటికే హైదరాబాద్‌లో పేరున్న కంపెనీలు, బ్యాంకులు, బీపీవో సంస్థలు ఫైనాన్సియల్‌ సర్వీసులను అందిస్తున్నాయి. స్టాక్‌మార్కెట్‌ బ్రోకరింగ్‌ కంపెనీల సంఖ్య బాగా పెరిగింది. మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు కొత్త శాఖలను ఏర్పాటు చేస్తున్నాయి. పలు పేరొందిన బ్యాంకులు క్యాపిటల్‌ మార్కెట్‌ సర్వీసులను అందించేందుకు పోటీ పడుతున్నాయి.

షేర్ల కొనుగోలు లావాదేవీలలో బ్రోకింగ్‌ కమీషన్ల విలువ వేల కోట్లు. ఇప్పటికే ఎలాగూ బ్యాంకులు ఆర్థికసేవల రంగంలో ఉన్నాయి కనుక, క్యాపిటల్‌ సర్వీసులను సులువుగా అందించే సౌలభ్యం ఉంది. దీంతో బ్యాంకింగ్‌ రంగం ఫైనాన్సియల్‌ సర్వీసుల ద్వారా మరింత ఆదాయాన్ని సమకూర్చుకొనేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి. ఇందులో క్యాపిటల్‌ మార్కెట్‌ సేవల ఆదాయమే ఎక్కువ భాగం కాబోతుంది.

కార్పొరేట్కంపెనీలలో
వీటితోపాటు ఫైనాన్సియల్‌ రీసెర్చ్‌ ఓరియెంటెడ్‌, ఫైనాన్సియల్‌ డేటా ప్రొవైడింగ్‌ కంపెనీల సంఖ్య పెరుగుతోంది. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు కూడా ఫైనాన్సియల్‌ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాయి. హైదరాబాద్‌లో విప్రో, హెచ్‌సీఎల్‌, బ్రిగేడ్‌, క్యాపిటల్‌ ఐక్యూ, జెన్‌పాక్ట్‌, ఏడీపీ, ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌, డిలయిట్‌, జీఈ, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా తదితర పేరున్న సంస్థలు ఈ కోవలోనే సేవలు అందిస్తున్నాయి.

ఈ సంస్థలలో ప్రవేశించేందుకు బీకాం, ఎంకాం, సీఏ, ఎంబీఏ ఫైనాన్స్‌ పూర్తి చేసిన అభ్యర్థులకు అవకాశం లభిస్తోంది. ఎంబీఏ ఫైనాన్స్‌ అభ్యర్థులు ఎన్‌సీఎఫ్‌ఎం, ఆంఫీ సర్టిఫికెట్లు సంపాదిస్తే మెరుగైన ఉద్యోగాలు లభిస్తాయి. ఈ కోర్సులకు హైదరాబాద్‌లోని ఎన్‌సీఎఫ్‌ఎం అకాడమీలో శిక్షణ ఇస్తున్నారు. అభ్యర్థులకు సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌, కమ్యూనికేషన్‌ స్కిల్క్‌, ఇంగ్లిష్‌ సామర్థ్యం ఉంటే.. ప్రారంభంలోనే ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తాయి. క్యాపిటల్‌ మార్కెట్‌ నిపుణుల అంచనా ప్రకారం రానున్న పదేళ్లలో ఈ రంగంలో పది లక్షల ఉద్యోగాలు భర్తీ కానున్నాయి.

ఎలాంటి ఉద్యోగాలు..
ఫైనాన్సియల్‌ మార్కెట్‌లో అభ్యర్థి ప్రతిభాసామర్థ్యాలను బట్టి పలు రకాల ఉద్యోగాలు ఉన్నాయి. టెర్మినల్‌ ఆపరేటర్‌, రిపోర్ట్‌ జనరేటర్స్‌, స్టాక్‌ బ్రోకింగ్‌ డీలర్స్‌, ఫైనాన్సియల్‌ ఎనలిస్ట్‌, బిజినెస్‌ ఎనలిస్ట్‌, ఫైనాన్సియల్‌ ప్రోడక్ట్‌ సెల్లర్స్‌, స్టాక్‌ ఎనలిస్ట్‌, ఫండ్‌ మేనేజర్స్‌, ప్రాసెస్‌ అసోసియేట్‌, డొమైన్‌ ఎక్స్‌పర్ట్‌ తదితర హోదాల్లో నియామకాలు ఉంటాయి. ఇప్పుడున్న సంక్షోభంలో కూడా బీకాం, ఎంకాం లేదా ఎంబీఏ ఫైనాన్స్‌ పూర్తి చేసి ఎన్‌సీఎఫ్‌ఎం సర్టిఫికెట్‌ సంపాదిస్తే.. తప్పకుండా మంచి ఉద్యోగం లభిస్తుంది. భవిష్యత్తులో క్యాపిటల్‌ సర్వీసుల రంగానికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని.. ఇప్పటి నుంచే కృషి చేస్తే మేనేజ్‌మెంట్‌ గ్రాడ్యుయేట్లకు ఢోకా ఉండదు.

ఆంధ్రజ్యోతి, తేది: 8-6-09
పూర్తిగా చదవటానికి క్లిక్ చేయండి...

ఉద్యోగం మానేస్తున్నారా..? ఒక్క నిమిషం..!

కారణం లేకుండా ఎవరైనా ఉద్యోగం మానేస్తారనుకుంటే పొరపాటు. ఇంతకూ మీరు ఉద్యోగం మానేసేందుకు ఎలాంటికారణముందో మీ సహోద్యోగులతో ముచ్చటించండి.

- పని ఒత్తిడి, బాస్తో పడకపోవడం, పనివేళలు పాటించకపోవడం.. సహజంగా కారణాలే ఉద్యోగులు చెబుతుంటారు. మీరు ఇలాంటి కారణంతోనే మానేస్తున్నారా..?

అయితే, ప్రస్తుతం మీరు పనిచేస్తున్న కంపెనీలో నెలకొన్న వాతవరణం, కొత్త కంపెనీలో కూడా లేదని మీకు ఖచ్చితంగా తెలుసా..? భవిష్యత్తులో తిరిగి ఇలాంటి సమస్యలే ఎదురుకావు అనుకుంటున్నారా..? అయితే మీ అంచనాలు కరెక్టు కాదు.

- కంపెనీ అంటేనే వ్యాపారత్మకం. నిర్దేశిత సమయానికి ఫలానా పని పూర్తిచేయాలన్న లక్ష్యం ఉంటుంది. ఆ ప్రక్రియలో సహజంగానే మీపై ఒత్తిడి ఉంటుంది. దీనిని అర్థం చేసుకోకపోతే మీరు ఎక్కడా పని చేయలేరు.

- ఆఫీసు పనివేళలు సరిగా పాటించకపోయినా, పనిలో తరచూ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించినా, నాణ్యత లేకపోయినా బాస్‌ మందలిస్తాడు. ఇంతకంటే భిన్నంగా మరో కంపెనీలో ఉంటుందనుకుంటే మీ తప్పే అవుతుంది.

- మీకున్న అనుభవం తక్కువే అయినా, అధిక వేతనాల కోసం కంపెనీ కాంట్రాక్టు గడువు తీరకుండానే వెళ్లడం ఉత్తమం కాదు. మీరు ఎలాంటి కమిట్‌మెంట్‌లు ఉన్నా సానుకూలం పూర్తి చేసుకోవడమే మంచిది.
పూర్తిగా చదవటానికి క్లిక్ చేయండి...

యానిమేషన్‌తో ఉద్యోగాలు

విద్యారంగంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఉద్యోగ అవకాశాలను దృష్టిలో ఉంచుకుని విద్యాసంస్థలు వివిధ రకాలకోర్సులను నిర్వహిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా వివిధ నగరాలలో యానిమేషన్కోర్సులు ఉన్నప్పటికీ, బెంగుళూరులోనియానిమేషన్ట్రైనింగ్సెంటర్లపై పలువురు మక్కువ చూపుతున్నారు.
శిక్షణా సంస్థలలో విజ్‌టూన్జ్‌ చెప్పుకోతగ్గది. కార్టూన్లు, యానిమేటెడ్‌ ఫిల్మ్‌లు రూపొందించడానికి అవసరమైన శిక్షణ కల్పించడంలో ఇది పేరుపొందింది. ట్రెడిషనల్‌, త్రీడీ, ఫ్లాష్‌ వంటి అంశాలతో శిక్షణ కల్పిస్తున్నది. ఈ సంస్థకు అనుబంధంగా ఉన్న క్రిస్టల్‌ డ్రీమ్స్‌ శిక్షణ పూర్తి చేసినవారికి ఉద్యోగాలు కల్పించడానికి కృషి చేస్తోంది. విజ్‌టూన్జ్‌లో శిక్షణ పొందగోరేవారు విజ్‌టూన్జ్‌ యానిమేషన్‌ అకాడమీ, ఫోన్‌ 09341683330 లో సంప్రదించవచ్చు. ఇ-మెయిల్‌ info@ wiztoonz.com, వివరాలకు సంస్థ వెబ్‌సైట్‌ www.wiztoolz.com నందు లభిస్తాయి.

ఆంధ్రజ్యోతి, తేది: 8-6-09


పూర్తిగా చదవటానికి క్లిక్ చేయండి...

భవిష్యత్తులో ఉద్యోగాల జాతర

భారత్లో ఇప్పటి వరకూ 10 లక్షల కంపెనీలు రిజిస్టర్అయ్యాయి. ఆరు లక్షల కంపెనీలు చురుగ్గావ్యాపారకార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ప్రతి నెలా 1000 నుంచి 1500 కంపెనీలు రిజిస్టర్అవుతున్నాయి. 2015 నాటికి 50 వేల మంది కంపెనీ సెక్రటరీలు అవసరం ఉంది.కానీ, 23 వేల మంది మాత్రమే కోర్సు పూర్తి చేసి బయటికివస్తున్నారు. వీక్‌, నీల్సన్నిర్వహించిన సర్వేలో కొత్తతరం గ్రాడ్యుయేట్లు తమకు ఆసక్తి కలిగిన రంగాలనువెల్లడించారు. ఎక్కువమంది ఫ్యాషన్డిజైనింగ్‌, మోడలింగ్‌, యానిమేషన్‌, గ్రాఫిక్స్‌, గేమింగ్రంగాలపట్ల మక్కువచూపారు.
రిటైల్‌, సేల్స్‌, మార్కెటింగ్‌, ఇంజినీరింగ్‌ రంగాలు ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఇన్సూరెన్స్‌, అడ్వర్‌టైజింగ్‌, లా రంగాలలో కూడా తమ కెరీర్‌ను సుస్థిరపరుచుకుంటామని గ్రాడ్యుయేట్లు చెప్పారు. ఠ నాణ్యమైన శిక్షణ అందిస్తే.. రిటైలింగ్‌, ఇన్సూరెన్స్‌, టెలికం రంగాల్లో ఉద్యోగాల వెల్లువ మొదలవుతుంది.

-ఈ సర్వేలో ఐటీ రంగమే చివరి స్థానం చేరుకుంది. ప్రస్తుతం అమెరికాలో ఆర్థికమాంద్యం ప్రభావంతో ఈ రంగం ఇప్పటికే సంక్షోభంలోకి కూరుకుపోయింది.తిరిగి పూర్వవైభవం రావాలంటే మరికొంత సమయం పడుతుంది.రంగం ఉద్యోగాలు రిటైల్‌ రెండేళ్లలో 22లక్షలు బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఇన్సూరెన్స్‌ రాబోయే అయిదేళ్లలో 10లక్షలకు పైగా ఐటీ రెండేళ్లలో 5లక్ష లు యానిమేషన్‌ అండ్‌ గేమింగ్‌ అయిదదేళ్లలో 3లక్షలకు పైగా హెల్త్‌ కేర్‌ మన దేశంలో 6 లక్షల డాక్టర్లు, 10లక్షల మంది నర్సుల కొరత హోటల్స్‌ 54000 ఉద్యోగాలు 2010 లోపు మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ 2011 వరకు ఇప్పుడున్న ఉద్యోగాలకు దాదాపు రెండు రెట్లు ఏవియేషన్‌ 2000 పైలెట్‌, వెయ్యికి పైగా స్టాఫ్‌ అడ్వ్‌రటైజింగ్‌ ఇంకో సంవత్సరంలో 2,500లకు పైగా

ఆంధ్రజ్యోతి

పూర్తిగా చదవటానికి క్లిక్ చేయండి...

మీ కెరీర్‌కు పదును పెట్టండి ఇలా..

రోజుల్లో కోర్సు చదవాలి.. ఉద్యోగం చేయాలి..? అన్న విషయాలు పిల్లలకే వదిలేస్తున్నారు చాలామందితల్లిదండ్రులు. సరికొత్త సృజనాత్మకత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకుంటున్న యువత.. కెరీర్అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. ప్రపంచంలో రోజూ అత్యంత వేగంగా మారిపోతున్న రంగాలు, కంపెనీల సేవలు బోలెడున్నాయి. అందుకని ఎప్పటికప్పుడుకెరీర్కు పదును పెడుతూ ఉండాలి.. ఎలాగంటే..

నేర్చుకోవడం ఆపొద్దు

కంపెనీల నడుమ పోటాపోటీ ఉంటుంది. వ్యాపార వ్యూహాలు ఎత్తుగడలు నిత్యం మారిపోతుంటాయి. మీరు కొత్తగా ఉద్యోగంలోకి ప్రవేశించారా.. ఏళ్లతరబడి ఉద్యోగం చేస్తున్నారా అన్న విషయంతో నిమిత్తం లేకుండా నిత్యం అప్‌డేట్‌ కావాల్సిందే. లేకపోతే మీకు మీరే వెనెకబడిపోతారు.

అడగండి, వినండి, తెలుసుకోండి :
మీ సహోద్యోగులతో పని గురించి చర్చించండి. మీ తప్పొప్పులను బేరీజు వేసుకోండి. ఫీడ్‌బ్యాక్‌ను తీసుకోండి. మీ బాస్‌ నుంచి అందిన సలహాలు స్వీకరించండి. సానుకూల దృక్ఫథంతో ముందుకు వెళ్లండి. మీకు ఎలాంటి సందేహాలు వ్యక్తమైనా ఇతరులను అడిగి తెలుసుకోండి.

అంకితభావం కావాలి
చాలామంది ఉద్యోగులు ఉన్న ఉద్యోగం సరిగా చేయకుండా మారబోయే కంపెనీలో బాగా కష్టపడి పేరుతెచ్చుకోవాలని కలలు కంటుంటారు. ఇది సరైన ఆలోచన కాదు. ఉన్న ఉద్యోగమైనా, రేపటి ఉద్యోగమైనా పని చేసిది మీరే. మీలో నిజమైన అంకితభావం ఉంటే ఎక్కడైనా ఒక్కటే.

నెట్వర్క్పెంచుకోండి
మీరు, మీ క్యాబిన్‌, మీ కంప్యూటర్‌.. ఇదే మీ ప్రపంచం కాకూడదు. విస్తృతంగా ఉద్యోగ సంబంధాలు పెంచుకోండి. భవిష్యత్తులో అవే అక్కరకు వస్తాయి. మీ రంగంలోని ఇతరత్రా పోటీ సంస్థలలో ఉద్యోగుల పరిచయాలు, వారు చేస్తున్న ప్రయోగాలు మీకు ఉపయోగపడతాయి. అందుకే మీకు మీరే నెట్‌వర్క్‌ను పెంచుకోండి.

గుర్తింపు తెచ్చుకోండి
మీ ఉద్యోగం రోజురోజుకూ నవ్యతతో కూడకున్నది కావాలి. బోర్‌ కొట్టేది కాకూడదు. ఇంకా కొత్తగా, వేగంగా చేయాలన్న తపన మీ నుంచే రావాలి. అప్పుడే మెరుగైన ఫలితాలు బయటికి వస్తాయి. గుర్తింపు లభిస్తుంది.

ఆంధ్రజ్యోతి


పూర్తిగా చదవటానికి క్లిక్ చేయండి...

బ్యాంకు ఉద్యోగాలు...

2009-10 సంవత్సర కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు దాదాపు ముప్పయ్వేల మందిని నియమించుకోబోతున్నట్లుఇన్స్టిట్యూట్ఆఫ్బ్యాంకింగ్పర్సనల్సెలెక్షన్తెలిపింది. ఉద్యోగాలు చేయాలనుకునేవారికి సబ్జెక్టులో పట్టుతోపాటుకమ్యూనికేషన్స్కిల్స్చాలా అవసరం.
యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ బ్యాంక్‌లు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు విడుదల చేశాయి. కోల్‌కత్తా కేంద్రంగా నడిచే యుబిఐ 900 ప్రొబేషనరీ ఆఫీసర్లు, 500 క్లర్కుల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఇవి కాకుండా 100 స్పెషలిస్టు ఆఫీసర్ల ఉద్యోగాల కోసం కూడా నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఇండియన్‌ బ్యాంకు కూడా ఈ సంవత్సరం 700 క్లర్కు ఉద్యోగాలను భర్తీ చేయనుంది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే ఆంధ్రాబ్యాంక్‌ 550 క్లర్కు ఉద్యోగాల భర్తీకోసం సన్నాహాలు చేస్తోంది. ఇది కాకుండా 295 ప్రొబేషనరీ ఆఫీసర్లు, 150 ఇతర కేటగిరీల్లోని ఆఫీసర్ల ఉద్యోగాలు కూడా భర్తీకి చేయనుంది.

ఇవి కాకుండా చాలా బ్యాంకుల నోటిఫికేషన్లు ఇటీవలి కాలంలో వెలువడ్డాయి, ఇంకా వెలువడుతున్నాయి. ఈ నోటిపికేషన్ల కోసం రెగ్యులర్‌గా ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌ పత్రిక చూస్తూ ఉండండి. చాలా కంపెనీలు నైపుణ్యంగల తమ ఉద్యోగులకు పింక్‌ స్లిప్‌ఇచ్చి బయటకు పంపిస్తుంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రం వేల మందిని నియమించుకుంటున్నాయి. అందుకే ఈ ఉద్యోగం సంపాదించడానికి కావాల్సిన అర్హతలు, లక్షణాలు పెంపొందిచుకోండి.

ఆంధ్రజ్యోతి, 8-6-09


పూర్తిగా చదవటానికి క్లిక్ చేయండి...

కొత్త కోర్సు

కాలం మారుతున్న కొద్ది కొత్త కోర్సులు రూపొందుతున్నాయి. అలాంటిందే కాస్మొటాలజీలో ఎమెస్సీ. విదేశాల్లోఇలాంటివి పలు కోర్సులు ఉన్నప్పటికీ భారతదేశంలో మాత్రం ఇదే మొదటిది అని చెప్పవచ్చు. స్టయిలిష్గా, ఫ్యాషనబుల్గా ఉండాలనుకునేవారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతోంది. అందు కోసం శిక్షణ అవసరం. అదేకాస్మోటాలజీ. ఎమ్మెస్సీ ఇన్కాస్మొటాలజీ కాల వ్యవధి రెండు సంవత్సరాలు. ఇందులో నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. కోర్సులో భాగంగా 2500 గంటలపాటు థియరీ, ప్రాక్టికల్ట్రైనింగ్ఉంటుంది.

‌‌
అర్హతలు
ఎమ్మెస్సీ ఇన్కాస్మొటాలజీ కోర్సులో చేరడానికి
అర్హత ఏదైనా డిగ్రీ. స్త్రీ, పురుషులు ఎవరైనా ఈ కోర్సులో చేరడానికి అర్హులు. అందానికి సంబంధించిన ఉత్పత్తులో పేరుమోసిన 'అనూస్‌' ఈ కోర్సును అందిస్తోంది. ఈ కోర్సును హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ సహకారంతో రూపొందించారు.

అవకాశాలు
దేశంలో ఈ రంగంపై ఇంకా స్పష్టమైన అవగాహన లేదు. ఈ కోర్సులు చేసినవారు సెలూన్‌ లేదా బ్యూటీ సర్వీసుల్లో మాత్రమే పనిచేయాలనే ఒక అభిప్రాయం ఉంది. అక్కడ పనిచేయడం ఇష్టంలేని వారికి ఇతర అవకాశాలు కూడా ఉన్నాయి. దేశంలోని ప్రముఖ బ్యూటీ ఉత్పత్తులకు సంబంధించిన ట్రైనర్లుగా, బిజినెస్‌ ప్రమోటర్లుగా, సెంటర్‌ మేనేజర్లుగా పనిచేయవచ్చు. విదేశాల్లోనూ వీరికి అవకాశాలు ఉన్నాయి. నిజానికి డిమాండ్‌కు తగిన నిపుణులు మార్కెట్లో లేరు. ఈ కోర్సు చదువుతున్న అభ్యర్థులు కోర్సు పూర్తికాకముందే క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా వివిధ సంస్థల్లో ఉద్యోగాలు సంపాదించారు.

కోర్సు ఫీజు సెమిస్టరుకు లక్ష రూపాయలు. ఈ సంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో టై అప్‌ పెట్టుకుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఈ బ్యాంక్‌ నుంచి ఎడ్యుకేషన్‌ లోన్‌ తీసుకునే అవకాశం ఉందని అనుస్‌ సంస్థ చెబుతోంది. దరఖాస్తులను సంస్థ కార్యాలయం నుంచి కానీ, www.aibs.in వెబ్‌సైట్‌ నుంచికానీ పొందవచ్చు. దరఖాస్తు ధర రూ. 500/-. వివరాలకు అనూస్‌ ఇంటర్నేషనల్‌ బ్యూటీ స్కూల్‌, సోమాజీగూడ, హైదరాబాద్‌- 500 082, ఫోన్‌: 40 2331 6184/ 6147 సంప్రతించవచ్చు. చివరి తేదీ: 2009 జూలై 25

ఆంధ్రజ్యోతి, తేది: 8-6-09


పూర్తిగా చదవటానికి క్లిక్ చేయండి...

మీ జాబ్ కంప్యూటర్ మీదా?

మీరు కంప్యూటర్ మీద జాబ్ చేస్తున్నారా.. అయితే మీరు అనేక సందర్భాల్లో, మీకు ఖాళీ ఉన్న సమయాల్లో మీకు తెలియని వాటిని తెలుసుకోవాలని ప్రయోగాలు చేస్తూ వుంటారు. దానివల్ల ఒక్కొసారి ప్రయత్నం విఫలమై కంప్యూటర్ పాడైయ్యే ప్రమాదాము ఉంది. అందుకని అలా కాకుండా మీకు కనుక
కంప్యూర్పై ఎటువంటి సందేహం ఉన్నా సరే మీ సందేహాలను http://computerera.co.in/forum లో పోస్ట్ చేయండి. సమాదానం తెలిసిన వారు ఎవరో ఒకరు మీ పోస్ట్కి రిప్లే ఇస్తారు. అప్పుడు మీరు సులభంగా వాటిని చేరుకోవచ్చును. అందువల్ల మీకు టైమ్ సేవ్ అవుతుంది. ఈ సేవ్ అయిన సమాయాన్ని మీకు తెలిసిన విషయాలను (చిన్న విషయమైనా, పెద్డ విషయమైనా) అందరితో పంచుకోవడానికి ఈ Forum లో పోస్ట్ చేయండి. తద్వారా అందరికి నాలెజ్డ్ పెరుగుతుంది. ఇలా ఒకరికొకరు తెలిసిన విషయాలను పంచుకోవడం ద్వారా అందరికి ఉపయోగం మరియు మనం కొంత మందికి సాయం చేసామన్న తృప్తి మిగులుతుంది.
మరి మీ సందేహాలను తీర్చుకుని మీ ఆఫీసులో పని తొందరగా ముగించి మీ జాబ్ ని సులువుగా చేసుకొండి.

పూర్తిగా చదవటానికి క్లిక్ చేయండి...