చిన్న ఉద్యోగాలకు చిరునామా

మేనేజర్, ఆఫీసరు ఉద్యోగాలకు క్యాంపస్ ఇంటర్వ్యూలు... ఎంప్లాయిమెంట్ ప్రతికలు... ఇలా చాలా పోర్టళ్లు ఉన్నాయి. మరి ఆఫీసు బోయ్, క్లర్క్, పార్ట్ టైం ఉద్యోగాలు చేయాలనుకునే నిరుద్యోగులకు, రిటైరైన వారికి ఎవరు సాయపడతారు?

దుస్తుల షాపులు, రిటైల్ సంస్థలు, కాఫీ డేలు... ఇలా అనేక చోట్ల చిరు ఉద్యోగుల అవసరం ఉంటుంది. అలాంటి పనుల్ని వెతుక్కునే వారి సంఖ్య ఎక్కువేం కాదు. వీరిద్దరి మధ్య అనుసంధాన కర్తే piggyjobs. వివిధ సంస్థలు, ఫాపులు వారికి కాలసిన ఉద్యోగుల వివరాలు ఈ సైట్లో ఉన్నాయి. అలాగే ఈలాంటి ఉద్యోగాలు కావలసిన వారు మీ ప్రొఫైల్ ఉంచుకోవచ్చు కాడా. కేవలం వివరాలతో సరిపెట్టకుండా, చిన్న ఉద్యోగాలు కోరుకునే వారికి శిక్షణ ఇచ్చి అవసరమైన సంస్థలకు పరిచయం చేస్తుంది ఈ www.piggyjobs.com

పూర్తిగా చదవటానికి క్లిక్ చేయండి...

ఆఫీసులో హాయిగొలిపే వాతావరణం

అర్హతలకు తగిన ఉద్యోగం... అందుకు తగిన జీతం... చూసుకుని మంచి ఉద్యోగమేనని చేరిపోతాం. కానీ మరో అంశమూ గుర్తుపెట్టుకోవాలి. ఉద్యోగబాధ్యతలను సజావుగా నిర్వహించడానికి తగిన వాతావరణమూ ఉండాలి. అది లేకపోతే మన ప్రతిభను నిరూపించుకునే అవకాశమే ఉండదు. ఇది వ్యక్తిగతంగానే కాదు, సంస్థకీ నష్టమే.
కార్యాలయం ఒకటే. ఉద్యోగులు చాలామంది. అందరూ భిన్న నేపథ్యాలనుంచీ వస్తారు. వీరందరికీ అనుకూలమైన వాతావరణం ఉండాలి. అందుకు యాజమాన్యమే కాదు...సిబ్బందీ సహకరించాలి. వస్త్రధారణ నుంచీ సంబోధన వరకూ, సమయాసమయాలనుంచీ నైతిక విలువల వరకు చాలా అంశాలే ఇమిడిఉంటాయిందులో. అన్నీ సక్రమంగా ఉన్నప్పుడే ఆ సంస్థకీ అందులో పనిచేసే ఉద్యోగులకూ మంచి పేరు వస్తుంది. మనం మెలకువగా ఉన్న సమయంలో మూడొంతులు కార్యాలయంలోనే గడుపుతాం. అందుకే అక్కడి వాతావరణానికి అంత ప్రాధాన్యం. కాబట్టి కార్యాలయంలో సుహృద్భావ వాతావరణం నెలకొల్పుకోవడానికి ఏం చేయాలంటే...

* మీది పరిమిత సిబ్బందిగల చిన్న ఆఫీసైతే పర్వాలేదు. అలా కాకుండా చాలా పెద్ద ఆఫీసైతే కనీసం మీరు పనిచేసే విభాగంలోని సహోద్యోగులనైనా అందరినీ పరిచయం చేసుకోండి.
* పేరు, హోదాలు మాత్రమే కాదు వారి కుటుంబనేపథ్యమూ కాస్తయినా తెలిసివుండడం మంచిది.
* అలా తెలిసినప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా గబుక్కున సాయపడ్డానికి వీలవుతుంది. ఇలాంటి అవసరాలే మనుషుల్ని దగ్గరచేస్తాయి. ఒకరిపట్ల మరొకరికి నమ్మకం పెరిగి సుహృద్భావ వాతావరణమూ నెలకొంటుంది.
* చిన్న చిన్న వేడుకలకు సహోద్యోగులంతా కలిసి బృందాలుగా హాజరవడం అందరి మధ్యా బంధాన్ని బలపరుస్తుంది.
* నెలకింతని డబ్బు సేకరించి ఒక నిధి ఏర్పాటు చేసుకుని ఉద్యోగులందరి పుట్టినరోజులు జరపడం, చిన్న కానుకలివ్వడం... ఆఫీసుపట్ల, సహోద్యోగుల పట్ల అనుబంధాల్ని సుదృఢం చేస్తుంది.
* బృందానికి చెందిన వ్యక్తులతో, పక్కసీటువారితో... కాసేపు కాఫీకో, టీకో వెళ్లిరావడం ఇద్దరి మధ్య సత్సంబంధాలను పెంచుతుంది.
* వృత్తిపరంగా ఉపయోగపడని అనవసర చర్చలు, గాసిప్‌లకు కార్యాలయంలో తావీయనే కూడదు. ఎవరికి వారు ఈ నియమాన్ని కఠినంగా పాటిస్తే అనవసర చికాకులకు అవకాశమే ఉండదు.
* కార్యాలయానికి సంబంధించి ఏ సమాచారమైనా బయటివారికి ఒకేలా చేరాలి. ఒక్కొక్కరు ఒక్కోలా చెప్పకూడదు. అది సంస్థ విశ్వసనీయతను దెబ్బతీస్తుంది.
* ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం, అందరికీ సమానంగా పనులు అప్పజెప్పడం, సమాన గౌరవమివ్వడం... యాజమాన్యప్రతినిధులుగా వ్యవహరించే ఉన్నతాధికారులు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. అప్పుడే ఉద్యోగుల్లో సుహృద్భావ వాతావరణం నెలకొంటుంది.

పూర్తిగా చదవటానికి క్లిక్ చేయండి...

ఇంటర్వ్యూస్ అంటే బయపడేవాళ్ళే ఎక్కువ.

మనలో చాలామంది ఇంటర్వ్యూస్ అంటే బయపడేవాళ్ళే ఎక్కువ. ఇందుకు కారణం మనలో మనం పెట్టుకున్న ఫీలింగ్స్ మాత్రమే.

ఇంటర్వ్యూస్కి వెళ్ళే ప్రతీ ఒక్కరు ఫీల్ అయ్యేది, జాబ్ వస్తుందా రాదా? చూడండి క్లీయర్గా ఇక్కడ ఇంటర్వ్యూ అనేది మనకు జాబ్ ఇచ్చే ప్రొసెస్ కాదు, మనలో ఉన్న టాలెంట్ను కనిపెట్టె ప్రొసెస్. సాధారణంగా అందరిలోనూ టాటెంట్ ఉంటుంది. కాని ఎందుకు ఇంటర్వ్యూలో ఫేల్ అవుతున్నామని చాలా మంది అడగవచ్చు. ఇందుకు కారణం, పైన చెప్పిన విధంగా, ఇంటర్వ్యూకి వెళ్ళామంటే జాబ్తో తిరిగి రావాలని చాలా మంది మనసులో ఏర్పడిన భావం. జాబ్ జాబ్ జాబ్ అని మైండ్లో ఉండటం తప్ప, HR ఎటువంటి ప్రశ్న అడుగుతారు, దానికి తగిన సమాధానం మన దగ్గర ఉందా లేదా, ఒకవేళా ఉంటే ఎలా చెప్పాలి లేకపోతే ఎలా తెలియజేయాలి అనే విషయాలు మన మైండ్లో ఉండవు.

ఇంటర్వ్యూలో ప్రశ్నలు మనం cool గా ఆలోచిస్తే అవి చాలా సులభమైన ప్రశ్నలు. మనము ఏదో బయపడిపోయి సమాధానం చేయ్యలేక, మనకున్న చిన్న ప్రొబ్లమ్ను పెద్ది చేసి, మనం effect కాకుండా, కొత్తగా ఇంటర్వ్యూకు attend అయ్యే వాళ్ళ మైండ్స్ కూడా చెడకొడుతున్నాము.

చాలా సులభంగా మొట్టమొదటిగా మనం ఏ కంపెనీకి Apply చేసుకున్నామో, ఏ పోస్ట్ కు ధరఖాస్తు చేసామో చూసుకోవాలి. ఆ పోస్ట్ కు తగిన విధంగా Skills మన దగ్గర ఉన్నాయో లేవా అనేది ఆలోచించుకోవాలి. ఒకసారి క్లియర్ అయిన తరువాత, ఆ ఫలానా కంపెని గురించి కాస్త వివరాలు సేకరించండి. ఆ కంపెని యొక్క వెబ్సైట్, ఆ కంపెని ఎలా స్ర్టాట్ అయి్యంది, ఎటువంటి Projects వాళ్ళు డీల్ చేస్తారు తెలుసుకోండి.

* ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు కూల్గా వెళ్లండి. అంటే Professional Look తో వెళ్లండి. ఇంటర్వ్యూలో మనం ఏమి చేసినా మనల్ని ఎవ్వరూ ఏమి చేయరు. తప్పు చేబితే సెలక్ట్ అవము. కరెక్ట్ చెబితే సెలక్ట్ అవుతాం. ఇందులో ఒకటి గుర్తుపెట్టుకోండి. కొన్ని వేల కంపెనీలు ఉన్నాయి.

* మనం 3 లేక 4 కంపెనీలలో ఫేల్ అయినంత మాత్రాన ఫీల్ అవ్వాలసిన అవసరం లేదు. అదేవిధంగా మొదటి ఇంటర్వ్యూలోనే సెలక్ట్ అవ్వాలసిన రూల్ ఏమి లేదు.

* సెలక్ట్ అయిన ప్రతిసారి ఇంటికి వచ్చి మనల్ని మనం Analyze చేసుకోవాలి, అమెరికన్స్ ఎందుకు సక్సెస్ అయ్యారో గుర్తుకుతెచ్చుకోండి. మొదట వాళ్లను వాళ్ళు Analyze చేసుకుంటారు, చెయ్యటానికి అయితే చేస్తారు, లేకపోతే లేదు. thats y they been success in many sectors.

* ఇంటర్వ్యూ రూమ్ లో ఉన్నప్పుడు ఫ్రీగా కూర్చోండి. HR ని Stranger లేదా Friend గా అనుకోండి. కొంత మంది ఫ్రీగా కొత్త వాళ్ళతో కూడా మాట్లడతారు.

* HR తో Frankగా మాట్లాడండి. మనకి అన్ని తెలిసి ఉండటానికి మనమేమి సూపర్మెన్ కాదు లేకపోతే స్పైడర్మెన్ అంతకంటే కాదు. అందుకని అడిగిన వాటికి మనకి తెలిసిన జవాబు ఇవ్వాలి.

* ఒకవేళ తెలియకపోతే ఒక చిన్న Simple Smile. అంతే కాని టెంన్షన్ పడిపోవద్దు.

* HR ముందు కూర్చొనేటప్పుడు ఫ్రీగా Professional గా కూర్చోండి, గౌరవం ఇవ్వండి, Wishes తెలియజేయండి, Good Morning or Good Afternoon or Good Evening లాంటివి.

* చిరునవ్వు మోహంతో ఆత్మవిశ్వాసం గల కళ్ళతో ఉండండి.

పూర్తిగా చదవటానికి క్లిక్ చేయండి...

మనమే లీడర్స్‌


చిన్నప్పుడు బళ్లో ఒక పద్యం చెప్పేవారు... మొక్క మొలవగానే గబగబా ఓ వందబిందెలు నీరు తోడి పోసేస్తే అది చెట్త్టెపోదు. కాయలు కాయదు. ఎదగడానికి, కాసే వయసు రావడానికి సమయం పడుతుంది. అప్పటివరకూ మనం ఓర్పుగా ఎదురుచూడాలని. నిజమే కదా... ఏ పనికైనా దానిదైన సమయం ఒకటుంటుంది. అది వచ్చినప్పుడే పని జరుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగజీవితంలో ఒక్క క్షణం ఓర్పు వహించడం పెనువిపత్తునుంచి రక్షిస్తుంది. అదే ఒక్క క్షణం అసహనం చూపితే మొత్తం జీవితమే నాశనమవుతుంది.

ఆలస్యాన్ని, ఆకస్మిక పరిణామాలను, అననుకూల పరిస్థితులను... శాంతంగా ఎదుర్కొనడం సహనం. అదే లేకపోతే పరిణామాలెలా ఉంటాయంటే...

* ఎదుగుదల లేని జీవితం పట్ల ఎప్పుడూ కోపం, అసంతృప్తి వెంటాడుతుంటాయి.
* మనం అనుకున్నట్లుగా జరగకపోతే చదువైనా, ఉద్యోగమైనా రెండో ఆలోచన లేకుండా వదిలి వెళ్లిపోయేవాళ్లలో మనమూ చేరతాం.
* అనుకున్నంత వేగంగా పనులు జరగడంలేదని విసుక్కుంటూ శక్తిని, సమయాన్ని దుర్వినియోగం చేస్తాం. అదే శక్తిని పనులు జరిగే వైపు మళ్లిస్తే ఆశించిన ఫలితం త్వరగా వస్తుందని మర్చిపోతాం.
* అందరి తోడ్పాటు అందుకుంటూ ముందుకెళ్లే స్థితిలో ఉన్నప్పుడు తక్షణ ఫలితాలు కన్పించలేదని నిరాశచెంది సగం చేసిన పని వదిలివచ్చేస్తాం.
* మీరనుకున్నట్లుగా అవతలివ్యక్తి మారడంలేదని స్నేహంలాంటి అనుబంధాలను త్యాగం చేసి బయటకు వెళ్లిపోతారు.
* ఇన్నాళ్లూ చేసిందంతా మర్చిపోయి ఎంతసేపూ చేయలేకపోయినదాన్నే గుర్తుచేసుకుంటారు. ఫలితం.. నిరాశావాదిగా ముద్రవేయించుకుంటారు.
* లక్ష్యాల సాధనలో మిమ్మల్ని మీరు మర్చిపోతారు. సుఖసంతోషాలను కోల్పోతారు.
* పెద్ద ఆశయాన్ని చిన్న చిన్న లక్ష్యాలుగా విడదీసుకుని ఒక్కోటిగా సాధించే విచక్షణ, సామర్థ్యం ఉండవు. దాంతో అంత పెద్ద లక్ష్యమా అని నిస్పృహచెందడం, ప్రయత్నం చేసే ధైర్యం సైతం కోల్పోవడం జరుగుతుంది.

'ఈ ప్రపంచంలో సంతోషం ఒక్కటే ఉన్నట్లయితే మనకు ధైర్యం, సహనం అనే లక్షణాలు అలవడేవే కావు...' అన్నారు హెలెన్‌కెల్లర్‌. నిజమే కదా. అవే లేకపోతే జీవితంలో తుళ్లింత ఏముంటుంది? అందుకే సహనాన్ని అలవర్చుకోడానికి కొన్ని లక్షణాలను పెంపొందించుకోవాలి.

* వర్తమానంలో జీవించడమనే తత్వాన్ని ఒంటబట్టించుకోవాలి. ఈరోజు సంతోషం తర్వాత రేపటి సంతోషం గురించి ఆలోచించాలి. ప్రతిరోజునీ సంతృప్తిగా గడుపుతూ, అనుకున్న లక్ష్యానికి ఒక్కో అడుగే చేరువవడం నేర్చుకోవాలి.
* మనం మానవమాత్రులమన్న సంగతి మరవకూడదు. చేసే పనికి అన్నివేళలా సాదరస్వాగతం లభించకపోవచ్చు. ప్రతికూల పరిస్థితులు సాధారణం. వాస్తవదూరమైన ఆశయాలు నిరాశనే మిగులుస్తాయి.
* గతంలో చేసిన తప్పిదాల గురించే బాధపడ్తూ వర్తమానాన్ని, భవిష్యత్తుని కూడా నాశనం చేసుకోవద్దు. అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వర్తమానాన్ని, భవిష్యత్తుని కొత్తగా నిర్మించుకునే దిశగా ఆలోచించాలి. ప్రతిరోజుని కొత్తగా మొదలుపెట్టాలి.
* ఒక నష్టం నుంచి కోలుకోవడానికి, ప్రగతిసాధించడానికి సరైన ప్రణాళిక అవసరం. దాన్ని మర్చిపోవద్దు.
* మన గురించి పట్టించుకోవడానికి ఎవరూ ఖాళీగాలేరు. ఎవరి పోరాటాలు వారివి. ఈ వాస్తవాన్ని మరవద్దు.
* దేనికైనా సమయం పడుతుంది. ఏ కళాఖండమూ ఒక్కరోజులో తయారవదు. బాధలు, భయాలు వదిలి సవాళ్లను ఎదుర్కొంటూ చురుగ్గా ముందుకు సాగాలి.

పూర్తిగా చదవటానికి క్లిక్ చేయండి...

అదీ ఓ ఉద్యోగమే!



ఏటా ఎంతోమంది యువతీయువకులు చదువులు ముగించుకుని ఉద్యోగాన్వేషణలో పడతారు. అలాంటివారిలో మీరూ ఒకరా? పైగా ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఉద్యోగం లభించడం కష్టసాధ్యమే. ఈ నేపథ్యంలో మీ ప్రయత్నాలు సరైన దిశలోనే సాగుతున్నాయో లేదో తెలుసుకోవడం అవసరమే కదా!
ఉద్యోగాన్వేషణలో ఉన్నవారికి ఎదురయ్యే ప్రధాన అవరోధాలేమిటో, వాటినెలా అధిగమించాలో తెలుసుకుందాం.
తగిన సమయం కేటాయిస్తున్నారా? ఉద్యోగాన్వేషణ కూడా ఒక పూర్తిసమయం ఉద్యోగంలా చేయాలంటారు నిపుణులు. ఇంకా కళాశాలలో ఉండో, ఒక ఉద్యోగంలో ఉండి మరో మంచి అవకాశంకోసమో అన్వేషిస్తున్నట్లయితే మీకు చాలా తక్కువ సమయం ఉంటుంది. దాన్నయినా సరైన రీతిలో వాడుకుంటేనే ప్రయోజనం ఉంటుంది.
అందరికీ చెప్తున్నారా? నెట్‌వర్కింగ్‌ చేయనిదే ఈరోజుల్లో పనికాదు. ఎప్పుడూ ఒక రెజ్యూమె ప్రతిని మీతో ఉంచుకోండి. మీరు ఏ రంగంలో ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నారో ఇతరులకు తెలియజేయండి. ముఖ్యంగా ఆ రంగంతో సంబంధం ఉన్నవారికి.
పత్రికలో ప్రకటనలు మాత్రమే చూసి దరఖాస్తు చేసి ఊరుకుంటున్నారా? ఇంటర్నెట్‌... ఇతరత్రా మార్గాలు కూడా అన్వేషిస్తున్నారా? ఎక్కడో ఒకచోటే వెదికితే సరిపోదు. అన్ని దారుల్లోనూ అన్వేషించాలి.
మీ నైపుణ్యాలేమిటో మీకు తెలుసు. అవి ఎక్కడ, ఎటువంటి సంస్థలకు అవసరమో కూడా తెలియాలి. ఆ సంస్థల్లో అవకాశాలకోసం ప్రయత్నించాలి. అక్కడ పనిచేసే ప్రముఖుల దృష్టిలో మీ నైపుణ్యాలు పడేలా అవకాశాలు ఆలోచించాలి. మీ నైపుణ్యాలు అవసరమైన సంస్థలను లక్ష్యంగా పెట్టుకుని ఉద్యోగాన్వేషణ చేస్తే పని సులువవుతుంది.
దరఖాస్తు పంపి ఊరుకుంటారా? ఫాలోఅప్‌ చేస్తారా? చాలామంది దరఖాస్తు పడేసి తమ పనైపోయిందనుకుంటారు. కానీ ఫాలోఅప్‌ తప్పనిసరి. దరఖాస్తు చేసిన విషయం గుర్తుచేస్తూ ఇంటర్వ్యూ ఎప్పుడు ఉండే అవకాశం ఉందో తెలియజేయమంటూ ఫోన్‌ చేయడమో, ఈ మెయిల్‌ పంపడమో చేయాలి. మూడునెలలైనా నా దరఖాస్తుకు అతీగతీ లేదేమిటని పోట్లాడకుండా, ప్రొయాక్టివ్‌గా మాట్లాడేవారికి త్వరగా అవకాశాలొస్తాయి.
అన్నిటికీ దరఖాస్తు చేస్తున్నారు. తగిన రీతిలో ఫాలోఅప్‌ కూడా చేస్తున్నారు. అయినా ఇంటర్వ్యూలకు పిలుపు రావడం లేదంటే... ఆలోచించాల్సిందే. పొరపాటు మీ రెజ్యూమె లోనో, కవరింగ్‌ లెటర్‌లోనో ఉంది. కాబట్టి ఒకసారి నిపుణుల సలహా తీసుకుని విశ్లేషించుకోవడం ఉత్తమం.
చాలా ఇంటర్వ్యూలకు కూడా వెళ్లారు కానీ ఉద్యోగం రాలేదా? అంటే అర్థం మీ ఇంటర్వ్యూ నైపుణ్యం మీద దృష్టిపెట్టాలని. కాబట్టి ఈ విషయంలోనూ నిపుణుల సలహాలు సూచనలు తీసుకోవడం, స్నేహితుల సహకారంతో మాక్‌ ఇంటర్వ్యూలు ఏర్పాటు చేసుకుని మెలకువలు నేర్చుకోవడం అవసరం.
ఇంటర్వ్యూ తర్వాత కూడా ఫాలోఅప్‌ చేయాలి. నియామకాలు ఎప్పటివరకు పూర్తవుతాయో సాధారణంగా చెప్తారు. ఆ గడువు వరకూ మీకు పిలుపు రాకపోతే ఒకసారి ఫోన్‌ చేసి మర్యాదగా అడగండి. అడిగేతీరు ఉద్యోగం పట్ల మీ ఆసక్తిని తెలియజేయాలి.
ఇంటర్వ్యూ అయ్యాక మీకు ఉద్యోగం ఇవ్వడంలేదని చెప్పారు. అప్పుడు మీరు చేసిన పొరపాటేమిటో అడిగారా? అడిగినా చాలామంది సూటిగా చెప్పరనుకోండి. కానీ ప్రయత్నించడంలో తప్పులేదు. ఇంటర్వ్యూ చేసిన సభ్యుల్లో ఎవరో ఒకరు మీ పట్ల సానుకూలంగా స్పందించినవారు ఉంటారు కదా. నెమ్మదిగా వారి ద్వారా ప్రయత్నించండి. ఒకటి రెండు అంశాలు తెలిసినా చాలు, తర్వాత ఇంటర్వ్యూకి ఇంకా బాగా సిద్ధమవడానికి. ఒకసారి తిరస్కారానికి గురి కాగానే ఆ సంస్థ పట్ల వ్యతిరేకత పెంచుకోకూడదు. 'నా ప్రతిభకు మరింత మెరుగు పెట్టుకుని ఎప్పటికైనా మీ ప్రతిష్ఠాత్మక సంస్థలో ఉద్యోగం సంపాదిస్తాను' అనే చెప్పండి వారితో. అది ఉద్యోగం పట్ల, ఆసంస్థ పట్ల మీ గౌరవాన్ని, ఆసక్తిని తెలియజేస్తుంది. తద్వారా తర్వాత అవకాశం మీకే రావచ్చు.

పూర్తిగా చదవటానికి క్లిక్ చేయండి...