ఆర్ధిక మాంద్యం అమెరికాలో మొదలైంది. ఐరోపాకు విస్తరిస్తోంది. మొదట బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్ను తాకింది. ఇది ఇప్పుడు భారత్తోపాటు అనేక దేశాల ఐటీ రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. అయితే, ఆఫ్సోర్సింగ్ డిమాండ్ మాత్రం కచ్చితంగా కొనసాగుతుంది. ఎందుకంటే... ఆఫ్సోర్సింగ్ ద్వారా 50 నుంచి 60 శాతం మేర వ్యయనియంత్రణ అవుతుంది. భారత జీడీపీలో ఐటీ రంగం వాటా 5.3 శాతం దాదాపు 2 మిలియన్ల మందికి దేశ ఐటీ రంగం ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది.
కంపెనీలు ఎలాంటి వాళ్లకు ప్రాధాన్యం ఇస్తాయి?
కొంతమంది విద్యార్ధులకు డిష్టింక్షన్ వస్తుంది. మరికొందమందికి ఫస్ట్ క్లాస్ వస్తుంది. ఇంకొంతమంది సాధారణ మార్కులతో పాసవుతారు. ఎందుకు?! దీనికి ఒకటే కారణం.. కష్టపడే వాళ్లకే మంచి మారు్కలు వస్తాయి. కంపెన్టీల్లోనూ అలాగే జరుగుతుంది. సామర్ధ్యం, కష్టపడే తత్వం ఉన్నవాళ్లే నిలదొక్కుకుంటారు. ఇండివిడ్యువల్ కాంపిటెన్సీ, కమిట్మెంట్, ప్లెకి్సబిలిటీ, హార్డ్వర్క్... ఇవే ఉద్యోగిని ఉన్నతస్థాయికి తీసుకెళ్లాయి. నేర్చుకోవాలనే తపన ఉండాలి. మీకు సీ++ బాగా వచ్చు. కాని అందులో అవకాశాలు లేవు. ఇప్పుడు జావాకు మాత్రమే అవకాలున్నాయి.అలాంటప్పుడు అది నేర్చుకుంటేనే పరిశ్రమలో మనగలుగుతాం. జావాలో అవకాశాలున్నాయి. మేం జావా నేర్పిస్తాం. ఫలానా చోటుకి మిమ్మల్ని పంపిస్తాం... అక్కడకు వెళ్లారా?? అన్నప్పుడు! మీరు రెండు విధాలైన సమాధానాలు చెప్పొచ్చు. ఒకటి... జావా నేర్చుకొని... అప్పగించిన పని చేస్తానని ఆత్మవిశ్వాసంతో చెప్పడం, రెండు... లేదు...! నేను సీ++ లోనే ఉంటా... అనడం! కచ్చితంగా మొదటి సమాధానం చెప్పిన వ్యక్తికే అవకాశాలు ఎక్కువ!!
ఎవరితోఅయినా మీ బంధం కలకాలం అందంగా నిలిచి ఉండాలంటే... చక్కటి భావోద్వేగాలు, వాటిని అందంగా వ్యక్తం చేసే నైపుణ్యం అవసరం. మనలో పలికే భావోద్వేగాలేమన బంధాలకు పునాది. మరి మీరు ఎంత వరకు మీ భావాలను, భావోద్వేగాలనుచక్కగా వ్యక్తం చేయగలుగుతున్నారు? అలా చేయడం వల్ల మీ బంధాలుబలపడుతున్నాయా? అనందాలు పంచుతున్నాయా ఆనే విషయాలను మీమ్మల్ని మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి.
ఇష్టం లేని వ్యక్తులతో మాట్లాడాల్సి వచ్చినప్పుడువారితో మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారా?
మీతో ఎవరూ మాట్లాడడం లేదనుకుందాం. ఎవరూమాట్లాడకపోవడం వల్ల మీరు వెలితిగా ఫీలవుతున్నారా?
మీరు చెప్పే విషయాలు ఎదుటి వారిని బాధకు గురిచేస్తున్నాయా? లేదా అనేది ఎప్పుడూ గమనిస్తుంటారా?
మీ పనులను ఎవరైనా తప్పు పడితే ఆ విమర్శలనుసానుకూల దృక్పథంతో చూస్తారా?
ప్రధానమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు, మీ లోని భావోద్వేగాలు ఎప్పుడూ మీ ఆధీనంలో ఉన్నాయని భావిస్తున్నారా?
ఒత్తిడిని కలిగించే కారణాలను అన్ని సందర్భాల్లో గుర్తించగలరా?
పాజిటివ్ ఆలోచనలు : ఆఫీసులో మీ పనిపట్ల, సహచర ఉద్యోగుల పట్ల పాజిటివ్ ఆలోచనలే కలిగి ఉండాలి. నెగెటివ్ ఆలోచనలు పనితీరు మీద ప్రభావం చూపించి, వెనుకబడేట్టు చేస్తాయి. సహోద్యోగులతో : ఆఫీసులో అందరితోనూ సత్సంబంధాలను కొనసాగించడం ద్వారా మీ బాస్, ఇతర ఉద్యోగుల దృష్టిలో మంచిపేరు తెచ్చుకోవచ్చు. ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు సహాయపడేందుకు సిద్ఢంగా ఉంటూ, అవసరమైనప్పుడు ఇతరుల సలహాలను స్వీకరిస్తే.. అందరికీ తలలో నాలుకలా మారిపోతారు! సమస్యాత్మకం కాకూడదు : ఏదైనా సమస్య వస్తే దాని గురించి పదేపదే చర్చించుకోవడం కన్నా దానికి పరిష్కారం కనుగొనడం మంచిది. తద్వారా పనిచేసే చోట ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడటమేగాక మీ లక్ష్య సాధనా సులవవుతుంది. పారదర్శకత : మీరు బాస్ అయినా, సీనియర్ ఉద్యోగి అయినా పని విషయంలో పారదర్శకతను పాటించడం మరిచిపోవద్దు. మీ వద్ద పనిచేసే సిబ్బందికి వారు చేయల్సిందేమిటో వివరంగా చెబిత పనిచేయడం వారిక సులభమవుతుంది. మీ సమస్యలూ తగ్గిపోతాయి. అంతేకాదు మీ పట్ల కృతగ్జ్నతతో అవసరమైనప్పుడు వారు మీ తరపున నిలబడతారు. సక్సెస్ను పంచుకోవడం : లభించిన విజయోత్సాహాన్ని మీ బృంద సభ్యులతో కలిసి పంచుకొంటే మీ ఆనందంలో వారికీ భాగప్వమ్యం కల్పించినట్టవుతుంది. ఆ ఉత్సాహంతో వారు మీకు మరింత దగ్గరవడమేగాక మరింత మెరుగ్గా పనిచేయగలరు. సవాళ్లకు సిద్ధం కావాలి : అంతకుముందెన్నడూ చేయని కొత్తపనులు చెయ్యడానికి అవకాశం వచ్చినప్పుడు వెంటనే అందుకోవాలి. విజయవంతంగా దాన్ని పూర్తిచేసినప్పుడొచ్చే సంతోషం, సంతృప్తి అమూల్యం! సవాళ్లను స్వయంగా గుర్తించి సాధిస్తే ఆ సంతృప్తి ఇంకా వేరుగా ఉంటుంది. విశ్రాంతి : మనం అనుకున్న పనులన్ని పూర్తి చేసినా కూడా మనసుకు ఇంకా ఏదో విసుగ్గా ఉందనిపిస్తే మీ శరీరానికి విశ్రాంతి కావాలని అర్ధం. కాబట్టి కొద్దిపాటి విశ్రాంతి తీసుకోండి!
ఉద్యోగ జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించడానికి స్వీయముద్ర (పర్సనల్ బ్రాండింగ్) కీలకపాత్ర పోషిస్తుంది. స్వీయముద్ర ఎంత బాగా ప్రస్ఫుటం చేసుకుంటే అంత త్వరగా పురోగతి కనిపిస్తుంది. సొంత గొప్పలు చెప్పుకోవడానికి, స్వీయముద్రకు స్ఫష్టమైన తేడా ఉంది. ఆర్భాటం ప్రదర్శించినంత మాత్రాన స్వీయముద్ర ప్రస్ఫుటమవుతుందనుకుంటే పొరపాటే. తనకున్న బలాబలాలు, పరిగ్జ్నానం, ఇతర నైపుణ్యాలపై సంపూర్ణ అవగాహన పెంచుకుని వాటి గురించి ఇతరులకు.. ముఖ్యంగా నిర్ణయాధికారం కలవారికి స్పష్టంగా తెలియచెప్పడం వల్లే ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం సాధ్యమవుతుంది. సిబ్బందికున్న వ్యక్తిగత బలాలలను సక్రమంగా ఉపయోగించుకోవడంలోనే విజయం దాగి ఉందని ప్రతి సంస్థకూ తెలుసు. ఎవరు ఎక్కువ సమర్ధులో అంచనా వేయడానికి సంస్థ ఎలాగూ ప్రయత్నిస్తుంది. సామార్ధ్యాన్ని సందర్భం వచ్చినప్పుడల్లా స్వయంగా తెలియచెప్పే ప్రయత్నం చేయడం వల్ల సమాచార అంతరం తొలగిపోతుంది. మీ ప్రత్యేకత గుర్తుండిపోతుంది.
ప్రతిభావంతులందరూ బహిరంగంగా ప్రకటించుకోవాలని లేదు. బహిరంగంగా ప్రకటించుకునే వారంతా ప్రతిభావంతులు కానక్కర్లేదు. ప్రతిభఉండీ, చక్కటి ఫలితాలను చూపిస్తూ కూడా ప్రయోజనం పొందెలేకపోతున్నారంటే స్వీయముద్ర విషయంలో వెనుకబడుతున్నారనే అర్ధం.
మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా? మీ కెరీర్లో ఎదుగుదల, .జీతంలో వృద్ధి ఉండాలంటే కొన్ని మెళకువలు పాటించడం తప్పనిసరి.
స్నేహాలు పెంచుకోవాలి...
మీ గురించి పాజిటివ్గా మాట్లాడేవారితో స్నేహం పెంచుకోండి. ఇరువురి అభిప్రాయాలను పరస్పరం పంచుకోండి. వారు మీకు భిన్నమైన డిపార్ట్మెంట్కు చెందినవారైతే మంచిది. ఎందుకంటే వారు మీ అవకాశాలకు గండికొట్టేవారు కాకూడదు కదా!
బాస్కు మంచి విషయాలే చెప్పాలి...
మీ బాస్తో మంచి విషయాలే చెప్పడం ద్వారా అభిమానం చూరగొనాలి. బాస్ మీతో మాట్లాడేందుకు ఆసక్తి ప్రదర్శించేలా మీ మాటతీరు ఉండాలి.
నచ్చేవిధంగా నడుచుకోవాలి.
బాస్కు నచ్చినదేమిటో తెలుసుకోగలగాలి. అతనికి నచ్చేనవిధంగాఅనుకరించాలి. సాధారణంగా బాస్లు తమను ఇష్టపడేవారిపై అభిమానం చూపిస్తారు.
బహుమతులు గెలుచుకోండి...
మీ వృత్తికి సంబంధించి ఏ సంస్థవారు అవార్డులిచ్చినా దరఖాస్తు చేసుకోండి. మీకు అవార్డు వస్తే పనిచేసే సంస్థ సంతోషిస్తుంది. బాస్ దృష్టిలోనూ పడతారు.
సరైన స్థానాన్ని ఎంచుకోండి...
బాస్తో కలసి ఉన్నప్పుడు మిమ్మల్ని ఫోకస్ చేసుకోవాలనుకుంటే సమావేశాల్లో అతని పక్కసీట్లో గాని, ఎదురుగా గాని కూర్చోరాదు. బాస్ దృష్టికి అందేవిధంగా దూరంగా కూర్చోవాలి.
నలుగురితో మంచి సంబంధాలు కలిగి ఉండటంతోపాటు మీకున్న ఇమేజ్నూ కాపాడుకోవాలి. పరిచయస్తులతో రాత్రిపూట పార్టీకి వెళ్లినా మర్నాడు ఉదయం ఆ ప్రభావం మీ పనిమీద పడరాదు. బాస్ దృష్టిలో మీ ఇమేజ్ ఎప్పుడూ క్లీన్గా ఉండాలి మరి!
ఉద్యోగంలో ఒత్తిడి ఇప్పుడొక సమస్యగా మారుతోంది. ఈ ఒత్తిడి కారణంగా అటు ఉద్యోగంలోనూ సరిగా రాణించలేక ఇటు వ్యక్తిగత జీవితంలోనూ అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు. ఉద్యోగవేటలోనూ ఒత్తిడే. ఉద్యోగం పోతుందన్న భయంతోనూ ఒత్తడే.. దీనికి పరిష్కారం ఏమిటి? పరిష్కారం కచ్చితంగా మన చేతుల్లోనే ఉంది. ఒత్తిడిని నియంత్రించుకునే, దాన్ని జయించే మార్గాలు సమస్య మూలాన్ని బట్టి మారతాయి.
రాజకీయాలు: పనిచేసే చోట రాజకీయాలు సర్వసాధారణం. పనితీరును విశ్లేషించడానికి శాస్త్రీయ కొలమానం లేని చోట్ల ఇది మరీ ఎక్కువ. బాస్ దగ్గర పేరు కొట్టేయడానికి, పదోన్నతులు, ఇంక్రిమెంట్లు, ఇతర ప్రోత్సాహకాలు దక్కించుకోవడానికి కొంత మంది రాజకీయాలకు పాల్లడుతుండొచ్చు. తాము ముందంజలో ఉండడానికి సహచరులకు ఇబ్బంది కల్లించే పనులు చేయొచ్చు.
పరిష్కారం:‘‘పనిచేసే చోట రాజకీయాలు డబ్ల్యుడబ్ల్యుఎఫ్ పోటీల్లాంటివి. వాటిని చూసి ఆనందించాలి కాని అందులో పాల్గోనకూడదు’’ ఓ నిపుణుడు హాస్యపూర్వకంగా చెప్పిన సమాధానం ఇది. మార్పు మననుంచే మొదలవ్వాలి. వారిమీద.. వీరిమీద.. పరోక్షంలో చేసే సంభాషణల్లో మీరు అసలు తలదూర్చొద్దు. ఎవరితో ఏ సమస్య ఉన్నా వారితోనే సరాసరి మాట్టాడాలి. అది కూడా సమస్యను పరిష్కారించుకోవడానకి మీరు సానుకూలంగా ఉన్నట్లు సంకేతాలివ్వాలి. మీరు సానుకూలంగా ఉన్నట్లు స్పష్టంగా అర్ధమయితే అటువైపునుంచి కూడా సానుకూలతే వ్యక్తమవుతుంది. మీ పనితీరు బాగున్నా ఇతరుల రాజకీయాల వల్ల మీరు వెనుకబడుతున్నట్లు మీరు భావిస్తే దానికి ఒకటే పరిష్కారం ఉంది. మీ బాస్తో సరాసరి మాట్లాడడం. ఎప్పటికప్పుడు మీ పనితీరు గురించి ఆయనతో చర్చించాలి. ఏం పనిచేశారు. దానికి మీరు అనుసరించిన ప్రణాళిక ఏమిటి.. ఎంత కష్టపడ్డరు దాని ఫలితాలు ఎలా వచ్చాయి.. వంటి విషయాలు తెలియచెప్పాలి. మీకు సహకరించిన వారి పేర్లుకూడా చెప్పడం మరవొద్దు. ఏ పనికూడా ఒక్కరి చేతులమీద సత్పలితాలివ్వదు. ఇతరుల సహకారం తప్పనిసరి. వారి పేర్లు కూడా కల్గుతుంది. అది నాయకత్వ లక్షణం కూడా.
తడబాటు: చాలా మందికి తాము నిర్వర్తించాల్సిన విధులపై సంపూర్ణ అవగాహన ఉన్నా ఆ సమయం వచ్చేసరికి తడబడతారు. ఆందోళన చెందుతారు. ఈ సమస్య గురించే అనుక్షణం ఆలోచిస్తూ నిత్యం ఒత్తిడికి గురవుతుంటారు. ఉదాహరణకు బాస్ సమక్షంలో ఖాతా దారులకు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ప్రణాళికను వివరించే సదర్భంలోనూ.. బాస్తో సమీక్షా సమావేశాల్లోనూ చాలా మందికి కాళ్లూ చేతులూ వణుకుతాయి. చెమటలు పడతాయి. మాట తడబడుతుంది.
పరిష్కారం: మీకంటే వారు స్థాయిలో ఎక్కువ అనే ఆందోళన అసలు ఉండకూడదు. ఆ సమయంలో హోదాల గురించి ఫూర్తిగా మరచిపోండి. వారందరినీ మీ సహచరులగానే భావించండి. మీకు వచ్చిన ఒక ఆలోచనను మీ స్నేహితులతో, సన్నిహితులతో పంచుకున్నట్టుగానే భావించండి. ఈ తరహ దృక్పథం చక్కటి ఫలితాలిస్తుంది. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. నలుగురి ముందుకు వెళ్లే ముందు ఒకటికి పదిసార్లు సాధన చేసుకుని వెళ్లే మాటలో తడబాటుకు ఆస్కారం ఉండదు.
ఎక్కడివి అక్కడే....
ఉద్యోగంలోని సమస్యలను కార్యాలయంలోంచి బయటపడగానే వదిలేయాలి. వాటిని ఇంటివరకూ తీసుకెళ్లకూడదు.కుటుంబసభ్యులతో ఆహ్లాదంగా గడపటం వల్ల చాలా వరకు ఒత్తిడి మటుమాయమవుతుంది. ఉద్యోగం తాలుకూ చిరాకును ఇంటిదగ్గరా చూపిస్తే కొత్త సమస్యలను సృష్టించుకున్నట్లే. ఇంటిదగ్గర సమస్యలున్నా వాటిని అక్కడే పరిష్కరించుకోవడం ఉత్తమం. అక్కడి సమస్యల గురించి పదేపదే ఆలోచించినా ఆ ప్రభావం ఉద్యోగంపైనా ఉంటుంది. ఒత్తిడిని చిత్తు చేయడానికి కొన్ని చిట్కాలు....
రోజూ కొద్దిసేపు ఎటువంటి ఆలోచనలు లేకుండా కనీసం పావుగంట కళ్లుమూసుకుని కూర్చోవాలి.
పనిచేసే చోట కోపం వచ్చినా, వాగ్వాదాలు చోటుచేసుకున్నా, చిరాకు ఓ పావుగంట పాటు ఏమీ ఆలోచించకుండా నిండుగా గాలిపీల్చుకుంటూ వదులుతూ ఉంటే ఒత్తిడి దూరమవుతుంది.
పిల్లలు... ముఖ్యంగా పసిపల్లలు ఒత్తిడికి మంచి పరిష్కారం. వారిని ఆడిస్తూ.. వారితో ఆడుతూ ఉంటే ఒత్తిడి ఇట్టే మాయమవుతుంది.
వీలు దొరికినప్పుడల్లా కొత్త ప్రదేశాలకు.. ముఖ్యంగా ప్రకృతి రమణీయ ప్రదేశాలకు వళ్లిరావడం వల్ల మనస్సు కుదుటపడుతుంది.
ఉద్యోగం అంటే బాధ్యత.. తను ఉత్పత్తి చేసిన వ స్తువు లేదా సేవను వినియోగదారుడికి అందించటంఅనే వ్యాపార వ్యవస్థలో ఒక బాధ్యతను ఉద్యోగంగా ఇస్తారు. ప్రతి ఉద్యోగంప్రత్యక్షంగానో, పరోక్షంగానో మనుష్యుల జీవితాల మీద, తోటి ఉద్యోగుల పనితనంమీద ప్రభావం చూపిస్తుంది. ఉద్యోగం అనే బాధ్యతను సరిగ్గా నిర్వహించకపోతేదాని పరిణామాలు ఒక్కోసారి సుదీర్ఘంగా ఉంటాయి.
ఇంటర్వ్యూ అనే చిన్న పరీక్ష నుంచి ఏదో ఒక రకంగా గట్టెక్కి ఉద్యోగంసంపాదించుకోవడం కాకుండా.. నా పనితనం ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందనిప్రశ్నించుకోవాలి. ఒక ఔషధ తయారీ సంస్థలో చిన్న ఉద్యోగ నిర్లక్ష్యం ఎన్నోప్రాణాలు తీస్తుంది. అన్ని ఉద్యోగాల్లోనూ ఈ కోణం ఉంటుంది. దీన్నే 'టాస్క్ సిగ్నిఫికెన్స్' అంటారు. ఇది అర్థమైతే ఇంటర్వ్యూలకు సన్నద్ధం కావడం కూడా మరింతఅర్థవంతంగా ఉంటుంది.
ఇంటర్వ్యూ పట్ల నిర్లక్ష్యం తగదు.. ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలు అడుగుతారు. మనం కొన్నింటికి జవాబులు చెబితేచాలు. అన్నీ చెప్పకపోయినా పర్వాలేదు. జవాబులు సరిగా తెలియకపోయినా, ఊహించైనా చెప్పిచూద్దాం. కొన్ని జవాబులు కరెక్టైనా చాలు. ఇంటర్వ్యూలో నెగ్గుతాం.
మొదటి ఐదున్నర నిమిషాలే నిర్ణయాత్మకం ఒక అధ్యయనం ప్రకారం ఇంటర్వ్యూలో మొదటి ఐదున్నర నిమిషాలలోఒక అభ్యర్థిని ఎంపిక చేసుకోవాలా..? వద్దా..? అనే నిర్ణయం జరిగిపోతుంది.మిగిలిన ఇంటర్వ్యూ ప్రభావం చాలాసార్లు నామమాత్రంగా ఉంటుంది. అలాంటి కీలకసమయంలో.. ఎ) రెజ్యూమె తయారు చేసిన విధానం బి) అభ్యర్థి సమాధానాల్లోకనిపించే సాధికారత సి) ఎంచుకున్న రంగం, అంశం పట్ల ఉన్న ఆసక్తి, నిబద్ధత పరిశీలిస్తారు. దాదాపు అంతటితోనే ఎంపిక పూర్తయిపోతుంది.
ఫ్రెండ్స్ అందుకే ఇంటర్వ్యూలకు పూర్తిగాబుద్ధి కుశలత ఉపయోగించి తయారు కావాలి
ప్రస్తుత కాలంలో ఉద్యోగాల తీరుతెన్నులు పూర్తిగా మారిపోతున్నాయి. కొన్నేళ్ల క్రితం దాదాపుగా ఒకే రాష్ర్టానికి చెందిన ఉద్యోగులు కలసి పనిచేసేవారు. కానీ ప్రస్తుతం సంస్థల్లో భిన్న సంస్కృతులు కనిపిస్తున్నాయి. భిన్నప్రాంతాలకు చెందిన వారు కలిసి ఒకేచోట పనిచేయాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో విదేశీయులతో కూడా పనిచేయాల్సి వస్తోంది. ఇవన్నీ ప్రపంచీకరణ తెస్తున్న మార్పులు. వచ్చిన వ్యాపార అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి సంస్థలు ప్రతిభావంతుకోసం జల్లెడపట్టక తప్పదు. ఇలాంటి వారు ఒకే ప్రాంతంలో ఉంటారన్న భరోసా ఏమీ లేదు. వారు ఏ ప్రాంతంలో ఉన్నా వారిని సంస్థలు ఆహ్వానిస్తున్నాయి. ఇది కంపెన్లీల్లో మిశ్రమసంస్కృతికి దారితీస్తోంది.
ఈ పరిస్థితుల్లో రాణించాలంటే కేవలం పనిలో సామర్ధ్యం చూపించిన మాత్రాన సరిపోదు. జట్టు సమతూకం సరిగ్గా ఉండేట్లు ప్రతి ఒక్కరూ తమవంతు కృషచేయాలి. లేదంటే జట్టు మొత్తానికి చెడ్డపేరు వస్తుంది. ఒక వ్యక్తి దృక్పథంపై అతను పెరిగిన సమాజం ప్రభావం చూపిస్తుంది. అతని ఆలోచన సరళి, ఆకళింపు చేసుకునే విధానం, సమస్యలను చేసే కోణం, పరిష్కరించే విధానం, తెలియచెప్పే పద్ధతి... ఇలా అన్నీ అతను పెరిగిన సమాజానికి అనుగుణంగానే ఉంటాయి. అవన్నీ మరో వ్యక్తి కోణంలో భిన్నంగా కనిపించవచ్చు. దీన్ని కూడా అధిగమించి వాస్తవ అంశాలను సరిగ్గా బేరీజు వేసుకున్నప్పుడే జట్టు సమతూకం దెబ్బతినకుండా ఉంటుంది.
సహోద్యోగుల సంస్కృతి గురించి తెలుసుకోవడానికి ఆసక్తి కనబర్చాలి.
వారి పండుగలు వగైరా వాటికి శుభాకాంక్షలు చెప్పాలి. వీలయితే వారితో కలిసి వేడుకలు జరుపుకోవాలి.
వారి భాష నేర్చుకోవడానికి ఆసక్తి కనబర్చాలి.
మీ సంస్కృతి సంప్రదాయాల గురించి వారికి తెలపండి. పండగల సమయాల్లో వారిని మీ ఇంటికి ఆహ్వానించండి.
వీలైనప్పుడు వారి వివాహవేడుకలకు హాజరవ్వండి. మీ ఇంట్లో జరిగే శుభకార్యాలకు వారిని ఆహ్వానించండి.
ఖాళీ సమయాలు, వారాంతపు సెలవుల్లో వారితో మిత్రులంతా కలసి దగ్గర్లోని చారిత్రక ప్రదేశానికో... దేవాలయానికో వెల్లేలా ప్రణాళిక వేసుకోండి.
వారితో ఏవైనా విబేదాలు వస్తే.. వాటిని సామనస్యంగా పరిష్కరించుకోండి. యాజమాన్యం వరకూ తీసుకెళ్లే అది మీకు, వారికి ఇద్దరికీ మంచిదికాదు.
సాప్ట్వేర్ రంగం ఓ మలుపు తిరగడంతో చాలామంది కలలు కల్లలవుతున్నాయి. నలుగురు యువకులు మాత్రం కాలంతో పాటు మారారు, మార్పేదయినా దాన్ని తమకు అనుగుణంగా మలచుకున్నారు. మెగాస్టార్మెయిల్డాట్కామ్కు (www.megastarmail.com)కు రూపకల్పన చేసి, నాలుగునెలల కాలంలోనే ఢక్కామొక్కీలు తిన్నారీ బృందం.
ఆ నలుగురు...
గద్దె శివాజీ, శరత్ సిద్దోజు, గోగుల మహేష్ కృష్ణ, వెంకట కృష్ణ... జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదలే వీరందరినీ కలిపింది. గెలుపు వాకిట నిలిపింది. ఖమ్మం జిల్లా పుణ్యపురంకు చెందిన శివాజీ మెగాస్టార్మెయిల్ రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించారు. ఎంసీఎ పూర్తి చేసిన శివాజీ సాఫ్ట్వేర్ రంగంలో అవకాశాలకోసం ఆరునెలల పాటు వేట సాగించారు. ఫలితం లేకపోయింది. ఇంతలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడంతో యాహూ, గూగుల్ మాదిరిగానే మెగాస్టార్మెయిల్ చేస్తే.. అన్న ఆలోచన అతనిలో మొలకెత్తింది. మిగతా మిత్రులతో దీన్ని పంచుకున్నారు. అలా వెబ్డిజైనింగ్, యానిమేషన్, డాట్నెట్ వంటి కోర్సులతో పరిచయం వున్న శరత్సిద్దోజు, మహేష్, కృష్ణలు కలసి మెగాస్తార్మెయిల్డాట్కామ్ను శ్రీకారం చుట్టారు.
విజయం తెచ్చిన బాధ్యతలు...
ఈ వెబ్సైట్ను అతి తక్కువ కాలంలో గెలుపుబాటపట్టించడంలో ఈ యువకుల్లో ఒకొక్కరిదీ ఒకో పాత్ర. ప్రతీ రోజూ ఎప్పటికప్పుడు తాజా సమాచారం, మెయిల్ నిర్వహణ శివాజీ చూస్తారు. మహేష్, శరత్, కృష్ణలు డిజైనింగ్, కార్టూనింగ్, వాల్పేపర్స్, గ్యాలరీలను నిర్వహిస్తారు. కెరీర్, ఎడ్యుకేషన్ విశేషాలతోపాటూ నిరంతరం వినూత్న ఆలోచనలతో, సమాచారంతో ర్యాంకుల పరంగా పైకెగబాకుతున్న ఈ సర్వీస్ను దేశంలోనే నెంబర్వన్గా నిలుపుతామని ఆత్మవిశ్వాసం నిండిన కళ్లతో చెబుతున్నరు.
మనం కూడా వీళ్లని ఆదర్శంగా తీసుకుందాం. జీవితంలో ఎన్నోవడిదుడుకులు ఎదురౌతావుంటాయి. వాటిని ఎందుర్కొని మనం అనుకున్నది సాధిద్దాం. వీళ్లకి ‘ఆల్ ద బెస్ట్’ చెబుదామా...
వృత్తి జీవితంలో పైకెదగాలనే కోరిక సహజంగా అందరిలోనూ ఉంటుంది. ప్రణాళికంగా కృషి చేస్తే అది సుసాధ్యమే. అందుకు తొలిమెట్టు టీమ్ లీడర్. ఈ లక్షణాలున్నవారు సునాయాసంగా ఆ స్థానాన్ని చేరుకోవచ్చు.
టీమ్ లీడర్ కావాలంటే...
వెయ్యి అడుగుల ప్రయాణం కూడా తొలిఅడుగుతోనే ప్రారంభమవుతుంది. ఆ ప్రయాత్నాన్ని చివరిదాకా కొనసాగిస్తే ఫలితం చేజిక్కుతుంది. అలాగే మీరు టీమ్లీడర్ కావాలనుకున్నంత మాత్రాన సంస్థలు మిమ్మల్నే ఎంపిక చేస్తారని భావించవద్దు. మీ వ్యక్తిగత లక్షణాలు, సామార్ధ్యాలు, పనితీరు, యాజమాన్యం, సహచరులతో మీ ప్రవర్తన తదితర అంశాలన్నీ పరిశీలించిన తర్వాతే మీకు అవకాశం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తారు. ఇందుకు మీరూ కొంత కృషి చెయ్యాల్సి ఉంటుంది. టీమ్లీడర్గా ఎదిగేందుకు కావాల్సిన లక్షణాలు ఏమిటో ఒక్కసారి తెలుసుకుందామా..!
పరిశీలన: నిత్యం మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉండాలి. మీ జట్టు సభ్యుల కంటే మీకు అన్ని విషయాల్లోనూ ఎక్కవగా తెలిసి ఉండాలి. కేవలం మీకు అప్పచెప్పిన పని గురించే కాకుండా సంస్థలో మిగతా విభగాల పని తీరు పట్ల కూడా అవగాహన పెంచుకోవాలి. సంస్థ ఏదైనా అన్ని విభాగాల మధ్య సమన్వయంతో పనిచేయాల్సిందే. ఈ సమన్వయం సాధించడంలో టీమ్లీడర్ల పాత్ర కీలకం. కాబట్టి అన్ని విభాగాల గురించి కనీస పరిగ్జ్నానం కలిగి ఉండటం తప్పనిసరి.
నివారణ: వివిధ రకాల సమస్యలపై అవగాహన ఉండాలి. సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించడం కంటే కూడా ఎంత తొందరగా పరిష్కరించారు అన్నదే ముఖ్యం. ఏ సమస్యా చెప్పిరాదు. కాబట్టి ఏ ఇబ్బందులు రావచ్చో ముందుగానే ఊహించి అందుకు తగ్గ ప్రణాళికలను ముందస్తుగానే రూపొందించుకోండి. దీనివల్ల సమస్య ఎదురైనప్పుడు పరిష్కరం సులువవుతుంది. ఈ రకమయిన సాధన టీమ్టీడర్గా ఎంపిక చేసేటప్పుడు నిర్వహించే ఇంటర్వ్యూలో దోహదపడుతుంది.
సామార్ధ్య నిరూపణ: నలుగురిలోనూ మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెట్టేది ఏమిటి? మీ సామర్ధ్యమే. మీకు అప్పచెప్పిన పని కంటే ఎక్కువ చేసే సామర్ధ్యం ఉందనుకోండి ఎక్కువే చేయండి. ఈ సామర్ధ్యం కచ్చితంగా మిమ్మల్ని మీ టీమ్లో ‘ఒక్కరిగా’ నిలబెడుతుంది. మీకు పని అప్పచెప్పేంతవరకు ఖాళీగా ఉండవద్దు. మీరే చొరవచూపి పని తీసుకోండి. ఆ పని అయిపోతే మరో పని అడిగి తీసుకోండి. ఈ చొరవ మంచి ఫలితాన్నిస్తుంది.
ఆలోచన: సంస్థ అభివృద్ధికి, లేదా మీకు అప్పగించిన బాధ్యతలను మరింత సమర్ధంగా నిర్వహించడానికి (నిర్దేశించిన ప్రమాణాలకు భిన్నంగా) ఏమైనా ఆలోచనలు వచ్చి ఉంటే వాటిని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లండి. మీరు సంస్థకు హితైషులు అన్న విషయం ఇటువంటి సందర్భాల్లోనే తెలుస్తుంది.
నియంత్రణ: నలుగురితో కలిసి పనిచేస్తున్నప్పుడు ఏదో ఒక సందర్భంలో భిన్నాభిప్రాయాలు చోటుచేసుకోవచ్చు. అటువంటప్పుడు సామరస్యంగా వ్యవహరించండి. భావోద్వ్దేగాలను నియంత్రించుకోండి. వాగ్యుద్ధాలను నివారించండి. మీరు నియంత్రణ తప్పితే యాజమాన్యానికి మీపై ప్రతికూల అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. సామరస్య పూర్వకంగా సమస్యలను పరిష్కరించగలిగే వారినే టీమ్లీడర్లుగా ఎంపిక చేయాలని యాజమాన్యం భావిస్తుంది.
సృజన: నాయకుడు కావాలనుకునేవారు పనిలో సృజన చూపించాలి. కొత్తదనాన్ని ఆవిష్కరించాలి. ఇందుకు ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకోవాలి. భవిష్యత్లులో ఒక సాంకేతిక పరిగ్జ్నానాన్ని ఉపయోగిస్తారని తెలిసినప్పుడు దాన్ని అందరికంటే ముందుగానే నేర్చుకోవాలి. అవసరం వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటే మీలో ప్రత్యేకత ఏమీ లేనట్లే. మీరు నేర్చుకున్న విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడం ముఖ్యం. నేర్చుకున్న విషయాన్ని పనిలో చూపించాలి. అప్పుడే కొత్తదనాన్ని వారూ చూడగలుగుతారు.
గూగుల్ ఇంజినీరింగ్ సెంటర్లు ఉద్యోగుల ఎంపిక బాధ్యతల్ని నిర్వహిస్తుంటాయి. ఈ విభాగాలు అన్ని ప్రాంతాల్లో ఉన్న సమర్ధులైన అభ్యర్ధులను గుర్తించేందుకు కృషి చేస్తాయి. అభ్యర్ధులు http://www.google.com/jobs లో నేరుగా మీ వివరాలు పొందుపర్చవచ్చు. లేదా jobs@google.com కు మీరు ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటుందీ తెలియజేస్తూ మీ రెజ్యూమెను నేరుగా పంపవచ్చు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి వారి అవసరాలకు తగిన అభ్యర్ధుల వివరాలను సేకరించి ఫోన్ ద్వారా లేదా స్వయంగా ఇంటర్వ్యూ చేస్తారు. ఈ ఎంపిక విధానం అనేక స్థాయిల్లో ఉంటుంది.
గూగుల్ లో వేతనంతో పాటు అదనంగా లభించే ప్రయోజనాలు ఏమిటి?
గూగుల్ లో పనిచేసే ఉద్యోగులకు అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
బోనస్: ఉద్యోగులకు పనితీరు ఆధారిత నగదు ప్రోత్సాహం ‘పే ఫర్పెర్ఫార్ఫార్మెన్స్’ ఉంటుంది. వీటితో పాటు పీర్బోనస్లు కూడా ఉంటాయి.
స్పాట్ బోనస్: అద్వితీయమైన ప్రతిభ కనబర్చిన ఉద్యోగులను గుర్తిస్తూ స్పాట్ బోనస్ అందచేస్తారు. ఇది రూ. 5 వేల నుంచి రూ. 25 వేల వరకూ ఉంటుంది.
అవార్డులు: సంస్థలో విశిష్ఠ సేవలు అందించిన వారికి పురస్కారాలు ఉంటాయి. ఈఎంజీ అవార్డులు, వ్యవస్థాపక పురస్కారాలు అందజేస్తారు.
ప్రధానమైన లోపం., కెరియర్ అంటే సాఫ్ట్వేర్ రంగం, బీపీవో రంగంలో మాత్రమే అనుకోవడం. మిగతా రంగాల్లో కూడా అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్యూర్ సైన్సెస్ చదివే వారి సంఖ్య తగ్గిపోతుంది. సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. ఇది ప్రమాదకరం. ఇంజినీరింగ్లోనూ మెకానికల్, సివిల్, కెమికల్, ప్రొడక్షన్ వంటి వాటిల్లోనూ అవకాశాలు బాగానే ఉన్నాయి. మన వారు మాత్రం సాఫ్ట్వేర్ రంగాన్ని మాత్రమే పట్టుకొని వేళ్లాడుతున్నారు. ప్రత్యామ్నాయాలున్నాయన్న సంగతిని వారు తెల్సుకోవాలి. అందరూ ఒకవైపే వెళ్లకుండా ఈ రంగాలవైపూ చూడాలి. ఒక్క నిర్మాణ రంగమే మరో 250 వృత్తుల వారికి ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని ఉపాధి కల్పిస్తోంది. కాస్ట్అక్కౌంట్ వృత్తికీ ఇప్పుడు డిమాండ్ ఉంది. ప్రస్తుత ఆర్ధిక సంక్షోభంలో ప్రతి కంపెనీ ఖర్చులు తగ్గించుకోవడం అనివార్యంగా మారింది. ఈ ప్రక్రియలో కాస్ట్అక్కౌంట్ నిపుణులు కీలకం.
మీరు పనిచేస్తున్న రంగంలో మరోమెట్టు ఎదగాలనుకోవడం సహజం. ఇందుకు ఓ దగ్గరి దారి... మెరుగైన పరిగ్జ్నానాన్ని, మీ నైపుణ్యతను ఉపయోగించి మీ వృత్తిలో అవగాహన పెంచుకుంటే మీ రంగంలోనే మీరు మరో మెట్టు పైకి ఎదగటానికి ఉపయోగపడుతుంది.
ఉద్యోగాల కోత.... కంపెనీల మూసివేత... ఇలాంటి వార్తలు చదవకుండా, వినకుండా రోజు గడవని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉద్యోగం కోల్పోయిన వారి జాబితాలో మీరు కూడా ఉన్నరా? ఉంటే మీ ప్రస్తుత మానసిక స్థితిని, ఆందోళనను అర్ధం చేసుకోవచ్చు. దీన్ని అధిగమించి కొత్త కెరియర్, జీవితం ప్రారంభించడానికి సిద్ధమవడం కూడా మీ చేతుల్లోనే ఉంది. ఆశావాదంతో, పరిస్థితిని సమర్ధంగా ఎదుక్కోవడానికి అవసరమైన స్వీయ విశ్లేషణ ఈ దిశలో చాలా అవసరం.
అసలు సవాలు... పంచుకోవడమే!
ఉద్యోగం కోల్పోవడం ఎవరికైనా బాధాకరమే! జీవనాధారం కోల్పోయిన వ్యక్తికి తన ప్రపంచమంతా కళ్లెదుటే కూలిపోతున్నట్లు అనిపిస్తుంది. తొలినాళ్లలో పరిస్థితి మరీ కష్టంగా ఉండటం సహజం. ఉద్యోగం కోల్పోయిన విషయాల్ని కుటుంబ సభ్యులకు, మిత్రులకు తెలియజేయడం మరీ బాధాకరంగా అనిపిస్తుంది. ముఖ్యంగా మన సమాజంలో ఉద్యోగం చుట్టూ అల్లుకొని ఉండే పరువు, ప్రతిష్ఠలను దృష్టిలో ఉంచుకుంటే ఆప్తులకు కూడా విషయం తెలియజేయడం పెద్ద సవాలు లాంటిదే!
ఉద్యోగం పోతే ఆత్మగౌరవం దెబ్బతింటుంది. అనుకోకుండా జరిగే పరిణామంతో భయం, తిరస్కారం, కోపం, అవమానం లాంటి భావోద్వేగాలకు లోనవుతారు. ఆరోగ్యం మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. తీవ్రమైన ఒత్తిడి, రక్తపోటు, మధుమేహం లాంటి సమస్యలు రావచ్చు. చాలా దగ్గరగా ఉంటూ, అన్నీ పంచుకునే వారితో కూడా ఉద్యోగం పోయిన విషయాన్ని చెప్పలేరు. చాలామంది ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంటారు.
ఇప్పుడేం చేయాలి?
సరే...! ఉద్యోగం పోయింది. మీకు జరిగిన నష్ణాన్ని పూడ్చుకోవడం ఎలా? తక్షణ కర్తవ్యం ఏమిటి? ఇప్పుడేం చేయాలి?
ఉద్యోగం కోల్పోవడం ద్వారా ఏర్పడిన పరిస్థితిని ఎదుర్కోవడానికి అనేక మార్గాలున్నాయి. అన్నటికంటే ముందుగా వాస్తవ పరిస్థితిని అవగాహన చేసుకొని, మీకెదురైన ‘తిరస్కరణ దశ’ (denial phase)ను అంగీకరించాలి. పరిస్థితిని తలచుకొని ఒకట్రెండు రోజులు విచారం వ్యక్తం చేయవచ్చు. కుదుటపడటానికి కొంత సమయం తీసుకోండి. నిందల గురించి మర్చిపోయి... మీరు ఉద్యోగం కోల్పోవడానికి బాధ్యత మీదెనని గుర్తిచండి. మీ కెరియర్ను మళ్లీ గాడిలో పెట్టకోవడం కూడా మీ చేతుల్లోనే ఉందని మర్చిపోవద్దు. మీరేమీ కోల్పోలేదు. ఒక అవకాశం కోల్పోయారు.... అంతే! మరో అవకాశం తప్పకుండా మీ తలుపు తడుతుంది. మరో మంచి ఉద్యోగం కోసం ప్రయత్నించడానికి మానసికంగా సిద్ధమవడం అత్యంత కీలకమైన దశ.
మనదేశంలోని చాలా రంగాలపై ఆర్ధిక సంక్షోభ ప్రభావం పెద్దగా లేదు. అందువల్ల ఉద్యోగం సాధించడానికి దారులు పూర్తిగా మూసుకుపోలేదు. గతంలో మాదిరిగా వేతనాలు ఉండకపోవచ్చు గానీ, దాదపు అదే స్థాయి, జీవన ప్రమాణాలతో కూడిన ఉద్యోగం కోసం ప్రయత్నించవచ్చు.
ప్రస్తుత ఆర్ధిక సంక్షోభకాలంలో అసలు సిసలు సవాలు మార్కెటింగ్ సిబ్బందిదు. వినియోగదారులను ఒప్పించడానికి మునపటిక్నా ఎక్కువే శ్రమ పడాల్సి వస్తుంది. అందులోనూ ఔషదాల మార్కెటింగ్ మరింత క్లిష్టమైన వృత్తిగా మారింది. వాస్తవానికి ఈ వృత్తి ఆకర్షణీయంగా ఉంటుంది. లక్ష్యాలు సాధించిన సిబ్బందికి ప్రోత్సాహకాలు బాగుంటాయి. ఇప్పుడు కొత్త గరిష్ఠ ధర విధానం అమలులో ఉండడంతో మందుల దుకాణాల వారిని ఒప్పించడానికి కొంత శ్రమ పడక తప్పడం లేదు. అన్ని పన్నులతో కలిపి గరిష్ఠధరను విక్రయించడంతో ముద్రించిన ధరకంటే ఎక్కువ ధరకు విక్రయించడానికి వారికి అవకాశం దొరకడం లేదు. దీంతో ఏ కంపెనీ ఎక్కువ కమిషన్ ిస్తే వారి దగ్గరే మందులు కొనే పరిస్థితి ఇప్పుడు ఉంది. ఈ పరిస్థితుల్లో మార్కెటింగ్ విభాగాలను పరిపుష్ఠం చేసుకునే దిశగా కంపెనీలు పయనిస్తున్నాయి. రూ. 500 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీకి 700 నుంచి 800 మార్కెటింగ్ / సేల్స్ సబ్బంది అవసరం అవుతారు. సామర్ధ్యం, నైపుణ్యం ఉన్నవారికోసం కంపెనీలు అన్నేషిస్తున్నాయి. గతంలో తప్పనిసరిగా 60 రోజుల శిక్షణ ఉండేది. ఇప్పుడు దాన్ని కుదించారు. సాధారణ ఔషదాలకు 15 నుంచి 35 రోజుల మధ్యే శిక్షణ ఉంటోంది. ప్రత్యేక ఔషదాలకు మాత్రమే 60 రోజుల పాటు తప్పనిసరి శిక్షణ ఉంటుంది. కాబట్టి కొత్తగా చేరిన వారు తమను తామే సానబెట్టుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. ఆకర్షణీయమైన జీతభత్యాలు లభించే ఈ వృత్తిలో ప్రస్తుత కాలంలో రాణించాలంటే స్వతాహాగా ఉన్న నైపుణ్యాలనకు మరింత పదును పెట్టుకోవాలని, ప్రతి అంశంలోనూ జాగ్రత్తగా అడుగులు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వృత్తిలో కొత్తగా చేరిన వారు అవగాహన పెంచుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. సమయపాలన: ఈ విషయంలో చాలా కచ్చితంగా ఉండాలి. వైద్యులను కాని, నిల్వదారులను (స్టాకిస్టు) కాని కలుస్తామన్న సమయానికి కచ్చితంగా చేరుకోవాలి. అక్కడ వారు తీరిక లేకుండా ఉంటే వేచి ఉండడానికి కూడా సిద్ధపడి వెళ్లాలి. సాధారణంగా సేల్స్ సిబ్బంది పని వేళలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 10 వరకు ఉంటాయి. వైద్యులను కలవడానికి అనువైన సమయాలు అవి. ఒక్కొక్కరిని నెలలో మూడు సార్లు కలిసేలా ప్రణాళిక చేసుకోవాలి. ఆహార్యం: ఫార్మాసేల్స్ / మెడికల్ రెప్(ఎంఆర్) వృత్తి ఆకర్షణీయంగా మారడంతో ఒక ముఖ్యమైన అంశం ఆ నిపుణుల ఆహార్యమే. హుందాగా కనిపించే దుస్తులు, టై, పాలిష్ చేసిన ఘూ, చేతిలో చక్కటి ఎగ్జిక్యూటివ్ బ్యాగ్తో కనిపించే వారిని చూస్తే ఎవరికైనా ఆ వృత్తిలో చేరాలనిపిస్తుంది. వైద్యులను కలవడం కోసం బయట వేచిచూసేటప్పుడు ఎంఆర్లు ఒకరి ఆహార్యాన్ని మరొకరు పరిశీలించడం సర్వాధారణ విషయమే. కొంతమందికి ఒక్కో జతను రెండు రోజుల పాటు వేసుకునే అలవాటు ఉంటుంది. ఈ వృత్తితో అటువంటి అలవాటుకు స్వస్తి చెప్పాల్సిందే. ప్రతి రోజూ ఘూకు పాలిష్ చేసుకోవాల్సిందే. గడ్డం గీసుకోవాల్సిందే. ఈ విషయాల్లో రాజీ పడితే వృత్తిలో వెనుకబడినట్లే. రెండుచక్రాల బండిపై ఎక్కువగా తిరగాల్సి ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు తాజాగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆత్మవిశ్వాసం: వైద్యులతో మాట్లాడేటప్పుడు హుందాగా, వినయంగా ఉండడం ఎంతముఖ్యమో ఆత్మవిశ్వాసమూ అంతే ముఖ్యం. ఆకట్టుకునే ఆహార్యం మీ సొంతమవుతుంది. మిగిలిన సగం.. భావవ్యక్తీకరణ నైపుణ్యాలు, విషయ పరిగ్జ్నానంపై ఆధారపడి ఉంటుంది. విషయ పరిగ్జ్నానం బాగా ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఆంగ్లంలో దారాళంగా మాట్లాడగల్లేలా సాధన చేయండి. గతంలో కంటే కూడా ఇప్పుడు వైద్యులు ఉత్పత్తిపై మరింత లోతుగా ప్రశ్నలు గుప్పిస్తున్నారు. పోటీ ఉత్పత్తి కంటే మీ ఉత్పత్తి మెరుగైన క్లినికల్ ట్రైల్స్ వివరాలనూ వైద్యులు అడుగుతున్నారు. సరిగా పరిక్షలు నిర్వహించి చూసిందీ లేనిదీ నిర్ధారించుకుంటున్నారు. ఈ విషయాలన్నింటిపైనా అవగాహన అవసరం.
ఉద్యోగంలో చేరిన కొత్తలో ఉండే ఉత్సాహం కాలం గడిచే కొద్దీ తగ్గిపోతుంది. వృత్తిలో సాధించిన విజయాలు, యాజమన్యం మెప్పు కొన్నాళ్లకు పాతబడిపోతాయి. పనిలో కొత్తదనం, పోటీతత్వ్తం కొరవడితే వృత్తి జీవితం నిస్సానమవుతుంది. ఇలాంటప్పడు కొత్త కొలువుకు ప్రయత్నించే కన్నా చేస్తున్న పనిలోనే నూతనత్వం చూనించడం మంచిది. మీ వృత్తి జీవితంలో కొంచెం కొత్తదనాన్ని నింపుకోవడానికి ప్రయత్నించాలి. రెట్టించిన ఉత్సాహంతో, చక్కని ప్రణాళికతో పనిచేస్తే విజేతలుగా నిలవడం ఖాయం.
మూలకారణం ఏమిటి: వృత్తిలో నిరాశ ఆవహించడానికి మూలకారణం ఏమిటో ఆలోచించించండి. కొత్త అవకాశాల లేమా? అధికారుల నిర్లక్ష్యమా? వ్యక్తిగత సమస్యలా? కారణం తెలిస్తే దాని పరిష్కారం సులువవుతుంది.
ఒత్తిడిని జయించాలి: ఒకే సమయంలో ఎక్కవ బాధ్యతల్ని నిన్వహిస్తుంటే ఒత్తిడి పెరిగి ఈ సమస్య మరింత జటిలం అవుతుంది. ఇలాంటప్పుడు ప్రాధాన్యతా క్రమంలో రాసుకుని పూర్తిచేయండి. ముఖ్యమైన పనునల్ని ముదుచేస్తే మీలో విశ్వాసం పెరుగుతుంది. దీని ప్రభావంతో మిగిలిన పనుల్ని కూడా అదే స్ఫూర్తితో పూర్తి చెయ్యొచ్చు.
మొహమాట పడొద్దు: మీ బాధ్యతల్లో కష్టమైన పనులుంటే సహచరుల సహకారం తీసుకోండి. అవసరమైతే యాజమాన్యానికి సమస్యను సకారణంగా వివరించండి. దీనివల్ల మీకు అప్పగించిన పని సకాలంలో పూర్తయ్యేందుకు మార్గం దొరుకుతుంది.
విజయాల్ని గుర్తించండి: కొందరు తమ వ్యక్తిగత సామర్ధ్యాలను గుర్తించరు. దీంతో చెయ్యగలిగిన సత్తా వారిలో ఉన్నా విఫలమౌతుంటారు. ఇలాంటి విషయాల్లో మీ ఆత్మవిశ్వాసాన్ని మీరే పెంచుకోవాలి. ఇందుకు గతంలో మీరు సాధించిన విజయాల్ని గుర్తుచేసుకోండి. అది ఎంత చిన్నదైనా సరే! రోజువారీ సనుల్లో చిన్న చిన్న పనుల్ని సకాలంలో పూర్తిచేసుకునేలా చూడండి. ఉదాహరణకు మీ క్యాబిన్లోని పనికిరాని వస్తువుల్ని తీసివేయడం, మీ ఇన్బాక్స్లో అనవసరమైన మెయిల్స్ను తొలగించడం వంటివి రోజుకొక్కటి చొప్పున పూర్తి చేయ్యండి.
కొత్తగా ఆలోచించండి: రోజూ చేసే పనుల్నే కాస్త కొత్తగా చెయ్యండి. అంటే సహోద్యోగుల పనుల్లో సహాయపడటం, వృత్తి జీవితంలో ఎదిగే అవకాశాల్ని పై అధికారుల్ని అడిగి తెలుసుకోవడం వంటివి. ఏదైనా వృత్యంతర శిక్షణకు అవకాశం ఉంటుందేమో కనుక్కోండి. మీ వృత్తికి సంబంధించిన కోర్సులు ఉంటే దూరవిద్య ద్వారా చేయండి. మీ సీనియర్లతో సత్సంబంధాలు నెలకొల్పడం వల్ల మరిన్ని విషయాలు తెలుసుకోవడంతో పాటు మీలో ఆత్మన్యూతన తగ్గేందుకు కూడా ఇది దోహదపడుతుంది.
అభిరుచుల్ని ఆపొద్దు: వ్యక్తిగత అభిరుచులు కూడా పనితీరుని ప్రభావితం చేస్తాయి. వారంలోనో, రోజులోనో మీకోసం కొంత సమయాన్ని కేటాయించుకోండి. ఆ సమయంలో పుస్తకాలు చదవడం, నెట్లో మీ వృత్తికి సంబంధించి కొత్త సమాచారాన్ని తెలుసుకోవడం వంటివి చేయండి.
అనవసరమైనవి వదితేయండి: పనిచేసేటప్పుడు పరిసరాలు ప్రశాతంగా ఉంచుకోండి. ఎవరి వల్ల మీ పని ఆటంకమో గుర్తించి సాద్యమైనంతగా వారికి దూరంగా ఉండండి. వారికి దూరంగా ఉండండి. మరీ ఒత్తిడిగా ఉంటే ప్రశాంతంగాకళ్లు మూసుకుని గట్టిగా మూడు సార్లు ఊపిరి పీల్చండి.
అదే టేబుల్.. అదే కంప్యూటర్... తరగని పని.. పెరిగిన ఒత్తిడి.. ఆఫీస్ ఎగ్గొట్టి కాస్త రిలాక్స్ అవుదామంటే పులి గాండ్రింపులా ‘నో లీవ్స్’ అనే బాస్..! ఎక్కడికైనా పారిపోదామనిపిస్తుంది. అయితే, ఎప్పుడో వెళ్లిన టూర్ గ్జ్నాపకాలను భద్రంగా దాచుకుంటే ఒత్తిడి మటుమాయం. ఆ చిట్టి చిట్కాలిక్కడ చూడండి.
ఫోన్ ఆగిపోవాలి..
బిజీ బిజీ కాల్స్తో విసుగెత్తించే మీ ఫోన్ను కాసేపు స్విచ్ ఆఫ్ చేయండి. లంచ్ను హడావుడిగా ఆఫీస్లోనే ముగించకుండా బయటకెళ్లి భోజనం చేయండి. మీరెందుకు ఒత్తిడిగా ఫీల్ అవుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. టెన్షన్కు కారణమవుతున్న సమస్యనుంచి, మీ ఆఫీస్నుంచి కాసేపు దూరంగా ఉండండి. మనసుకు, శరీరానికి కాస్త హుషారునివ్వండి. విశ్రాంతిగా, ఉత్సాహంగా గడిపేందుకు కొన్ని నిమిషాలైనా ప్లాన్ చేసుకోండి.
ఫోటోలుంచే చాలు..
గతంలో మీరు ఎంజాయ్ చేసిన టూర్ ఫోటోలను మీరు పనిచేసే సిస్టమ్లో లోడ్ చేసుకోండి. మీరు కాస్త టెన్షన్లో ఉన్నప్పుడు ఆ ఫోటోలు చూడండి. మీరు ఆనందించిన క్షణాలనవి గుర్తుచేస్తాయి. ఆ ఫోటోల మాటున టూర్ అనుభూతులు దాగుంటాయి కనుక వాటిని చూసినపుడు కొన్ని క్షణాలు అక్కడికెళ్లపోయి రిలాక్సవుతారు.
పునఃస్మరణ...
గతంలో మీకు సంతోషాన్ని మిగిల్చిన విశేషాలను గుర్తు చేసుకోవడం అద్భుతంగా ఉంటుంది. తోటివారితో అప్పటి అనుభూతులను, భావాలను పంచుకోవడం ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆ మధుర క్షణాల్లో మీతో పాటు ఉన్న వారితో అప్పటి
సంగతులు ముచ్చటిస్తే, నెమరేసుకుంటే మనసు హుషారవుతుంది. ఇలాంటి డి్కషన్స్తో కొత్త సంతోషం మీ సొంతం, అదీగాక, అప్పటి సంతోషం రెండింతలవుతుంది.
సహజ వాతావరణంలో..
రెగ్యులర్ ఆఫీస్ వాతావరణానికి భిన్నంగా, బోర్ కొట్టే ఏసి గాలినుంచి కాస్త విముక్తి లభించేది ఆరుబయట ప్రదేశంలోనే. అయితేఎప్పుడనుకుంటే అప్పుడు అలా వెళ్లిపోవడం కుదరదు కనుక, ఇలాంటి సహజ వాతావరణాన్ని గుర్తు చేసేలా ఆఫీసులో దేన్నైనా ఏర్పాటు చేసుకోవాలి. లేదా మనసులోనే ఊహించుకోవాలి. ఉదయించే సూర్యుడు, కదిలే గాలి, సెలయేటిలో మీరు తాకిన నీరు, ప్రతీదీ అద్భుతమైన అనుభవమే, ఇలాంటి ఆలోచనలను నెమరు వేసుకోవటం వల్ల మనసు నెమ్మదిస్తుంది.
ప్రకృతి పలికే సంగీతం..
వెకేషన్లో విమ్ములను తేలియాడించిన సముద్రపు అలల సవ్వడి, పక్షుల అరుపులు ఒక్కటేమిటి మీ టూర్లో మిమ్ములను థ్రిల్ చేసిన ప్రతీ సౌండ్ మీ మనస్సులో చెరగని ముద్రవేసి ఉంటుంది. ప్రకృతి వినిపించే ఆ అద్భుత సంగీతాన్ని ఒకసారి గుర్తుచేసుకోండి. లయబద్ధమైన సహజ సంగీతాల రిథమ్ మిమ్ములను ఆనంద డోలికల్లో తేలియాడిస్తుంది.
దీర్ఘ శ్వాస...
శరీరాన్ని నిటారుగా నిలబెట్టి, రెండు కళ్లు మూసుకోండి. కాళ్లు నేలపై ఆన్చి, ముక్కుతో గుండెలనిండా గాలి పీల్చండి. ఇలా ఐదు పది నిమిషాల పాటు చేయండి. ఛాతి కండరాలకు కాస్త విశ్రాంతి దొరుకుతుంది. మీ ఆలోచనలు అలర్టై విశ్రాంతి తీసుకోవడానికి మనస్సు సిద్ధమవుతుంది.
అరుదైన వస్తువులు..
టూర్ నుంచి మీరు తెచ్చుకున్న సెంట్లను, భీచ్లో శరీరానికి రాసుకున్న సన్స్కీన్ లోషన్, సేకరించిన వనమూలికలు, అరుదైన వస్తువులను మీ ఆఫీస్ టేబుల్ సారుగులో జాగ్రత్త చేసుకోండి. ఇలాంటి వస్తువులను చూడడంతో మొదటిసారి వీటిని చూసినపుడు కలిగిన అనుభూతి కల్గుతుంది. మనసులో నిక్లిప్తమైన గుర్తులు, ఆలోచనలు, సువాసనలకు సంబందించిన సృ్తులు ఎన్ని రోజులవైనప్పటికి ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఆ సంతోషం తిరిగి సొంతమౌతుంది. మీరు ఎంత టెన్షన్లో ఉన్నా ఈ చిన్న చిన్న గ్జ్నాపకాలు కొత్త ఉత్సాహాన్నిస్తాయి. తిరిగి పని చేయడానికి టెన్షన్ ఫ్రీగా సిద్ధంచేస్తాయి.
ఉద్యోగం మారినా, రంగం మారినా ఉపయోగపడే నైపుణ్యాలు కొన్ని ఉంటాయి. అవి ఉంటే అభ్యర్ధికి అదనపు బలమే. అవే ట్రాన్స్ఫరబుల్ స్కిల్స్
ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే నిత్యం కృషి చేయాల్సిందే. కేవలం విద్యార్హతలు, సాంకేతిక నైపుణ్యాలు మాత్రమే ఉన్నంత మాత్రాన వృత్తి జీవితంలో ఉన్నతస్థానాలకు చేరుకోవడం సాధ్యం కాదు. నేటి ఉద్యోగ పర్వంలో మాత్రం వీటితో పాటు సరళకౌశలాలకూ చెప్పుకోదగిన స్థానమే ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మారుతున్న అవసరాలు, అందివస్తున్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుంటే కొలువులు మారాల్సి రావడం, కొన్ని పరిస్థితుల్లో ఉన్న రంగాన్నే విడిచి పెట్టి పూర్తిగా కొత్త రంగంలో వృత్తి జీవితాన్ని వెతుకో్కవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సందర్భాలలో మనకున్న సరళ కౌశలాలతో పాటు అన్ని రంగాల్లోనూ, అన్ని వృత్తుల్లోనూ, అన్ని స్థాయుల్లోనూ ఉపయోగపడే కొత్త కౌశలాలను అలవర్చుకోవాల్సిన అవసరం పెరుగుతోంది. వీటినే ట్రాన్స్ఫఫర్బుల్ స్కిల్స్ అంటారు. వృత్తి జీవితంలో ఎప్పుడూ ముదుస్థానంలో ఉండాలంటే వీటిని మెరుగుపర్చుకోవాలి. ఇవి నిర్దిష్టంగా ఒక పనిలో చూపించాల్సిన నైపుణ్యాలకు భిన్నంగా ఉంటాయి. ఏ రంగంలోకి వెళ్లినా, ఏ ఉద్యోగంలోకి వెళ్లినా ఇవి అభ్యర్ధిని ముందు వరుసలో నిలబెడతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కావాల్సిన ట్రాన్స్ఫరబుల్ ఇవే.
బడ్జెట్ మేనేజ్మెంట్ స్కిల్స్: ఆర్ధిక వనరులను సమర్ధంగా వినియోగించుకోగల్గడం అవసరం. ఆర్ధికసంబంధమైన విశ్లేషణలు అర్ధంచేసుకోగల్లిఉండాలి. విశ్లేషించగలిగి ఉండాలి. ఆర్ధిక వనరుల సమర్ధవినియోగానికి ఉపయోగపడే కంప్యూటర్ అప్లికేషన్లు తెలిసి ఉండాలి.
పర్యవేక్షణ నైపుణ్యం: ఒక టీమ్ను ముందుండి నడిపించగలిగే సామర్ధ్యం ఉండాలి. వారిలో స్తూర్తిని నింపి, మార్గదర్శకత్వం వహించగలిగి ఉండాలి. సమన్వయం సాధించగలిగి ఉండాలి.
ప్రజా సంబంధాలు: కంపెనీ బయట ఉండే వారితోనూ చక్కటి సంబంధాలు ఉండాలి. వివిధ రంగాల వారితో పరిచయాలు ఉండాలి. వినియోగదారులపై అవగాహన ఉండాలి..
సమయ పాలన: ఉన్న సమయాన్ని చక్కగా విభజించుకుని సమర్ధమైన ఫలితాలు తీసుకురావాలి. తక్కువ సమయంలో ఎక్కవ ఫలితాలు సాధించాలి. డెడ్లైన్లోగా పనులు పూర్తిచేయాలి.
వాక్చాతుర్యం, భావవ్యక్తీకరణ: ఎటువంటి సందర్భంలో అయినా ఎవరితో అయినా చక్కగా మాట్టాడగలిగి ఉండాలి. ఎదుటివారు చెప్పెది శ్రద్ధగా విని ఆకళింపుచేసుకునే సామర్ధ్యం ఉండాలి. ఎదుటివారికి కూడా అంతే సమర్ధంగా వివరించగలిగి ఉండాలి.
రాత-రీతి: నివేదికలు చక్కగా రాయాలి. డాక్యుమెంటేషన్ నైపుణ్యం ఉండాలి. సదర్భానికి తగ్గట్లుగా ప్రెజెంటేషన్ మారాలి. నివేదికలకు ఒక రకంగా, బిజినెస్ లెటర్లకు ఒక రకంగా, బ్రోషర్లకు ఒక రకంగా రాయాల్సి ఉంటుంది. ఆ కిటుకులన్నీ తెలియాలి.
నిర్వహణ సామర్ధ్యం: అప్పచెప్పిన పనిని సమర్ధంగా నిర్వహించాలి. అవసరమైన వనరులను సమకూర్చుకోవడం, సమస్యలను గర్తించడం, పరిష్కారించడం, నివారణ చర్యలు చేపట్టడం, పనివిభజన వగైరా అంశాల్లో నిష్టాతులై ఉండాలి.
బోధన నైపుణ్యం: నేర్చుకున్న విషయాలను సమీకరించి పెట్టడం, వాటిని అందరికీ అందుబాటులో పెట్టడం, అందరికీ వాటిని అర్ధమయ్యేలా వివరించడం ముఖ్యం.
ఇంటర్వ్యూయింగ్ స్కిల్స్: కొత్తవారిని టీమ్లో చేర్చుకునే ప్రక్కియలోభాగంగా మంచి ఇంటర్వ్యూలకు రూపకల్లన చేయగలిగి ఉండాలి. మంచి అభ్యర్ధులను ఎంపికచేసుకునే విధంగా ప్రశ్నల రూపకల్పన జరగాలి.