టెలికాంలో 1.50 లక్షల ఉద్యోగాలు

జాబ్మార్కెట్లో నెలకొన్న స్తబ్ధత మెలమెల్లగా వీడనుంది. ఇప్పటికీ ఐటీలో ఉద్యోగనియామకాలు ఊపందుకోలేదు. కానీ, మిగిలిన రంగాలు జోరందుకుంటున్నాయి. భారత్లో టెలికాం రంగంలో ఉద్యోగాలు వెల్లువెత్తనున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే మనదేశంలో టెలికాం రంగం పోటాపోటీగా వ్యాపార నిర్వహణ చేపడుతోంది. దీంతో ఏడాది ఆఖరునాటికి 1.50 లక్షల ఉద్యోగాలు లభించనున్నాయని మార్కెట్వర్గాల అంచనా.ప్రభుత్వం సుమారు 120 టెలికాం అనుమతులు ఇచ్చింది. ఇటీవలే ఈ రంగం లాభాల బాటలో పయనిస్తుండటంతో సుమారు 30 శాతం వేతనాలు పెంచారు. నిపుణుల కొరత కూడా ఎక్కువగా ఉండటంతో మెరుగైన వేతనాలు లభిస్తున్నాయి. భారత్‌లో 3జీ సేవలకు అనుమతి లభించడంతో టెలికాం సంస్థలు ఈ దిశగా విస్తరణ కార్యక్రమాలను చేపట్టాయి. ఈ ఏడాది మొదట్లో లక్ష ఉద్యోగాలు, ఆ తర్వాత 50 వేల ఉద్యోగాలను ఈ రంగం భర్తీ చేయనుందని హెడ్‌మంటర్స్‌ ఇండియా వివరించింది.

ఆంధ్రజ్యోతి


1 comments:

  1. Dear Sir,

    Iam vijaya.

    Please tell The telecom Jobs Vancency.

    Iam Completed From My gradutation

    ReplyDelete