నో ప్రాబ్లమ్‌!

మనదేశం ప్రస్తుతం ఆర్థీకమాన్యం కలిగి ఉన్నప్పటికి మన దేశ స్థూల జాతీయోత్పత్తిలో ఇన్ఫర్మేషన్టెక్నాలజీ, ఫైనాన్సియల్సర్వీసెస్‌, రియల్ఎస్టేట్‌, కన్స్ట్రక్షన్రంగాలు అధికవాటా కలిగి ఉన్నాయి. వచ్చే ఏడాది కాలంలోనిరుద్యోగుల సంఖ్య తగ్గవచ్చుని రంగాలలో ఉన్నవారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థికమాంద్యం ఉన్నప్పటికీ మాఉద్యోగాలకు ఢోకాలేదని జెమ్స్‌, జ్యువెలరీ, టెక్స్టైల్స్‌, చర్మపరిశ్రమలకు చెందిన ఉద్యోగులు ధీమాగా ఉన్నారు. ఆర్థికమాంద్యంతో నిమిత్తం లేకుండా‌‌ ‌ ఉద్యోగుల సంఖ్యను పెంచిన కొన్ని రంగాలు ఉన్నాయి. అవి... బ్యాంకింగ్‌, రిటైల్‌, ఎనర్జీ, ఫుడ్‌ అండ్‌ బివరేజస్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఫార్మాసిటికల్‌ రంగాలు. ఒకవేళ ఉన్న ఉద్యోగం పోయినా వేరే ఉద్యోగం చేసి జీవితాన్ని సాఫీగా లాగించేయవచ్చు అనుకొన్న వారు 43శాతం మంది ఉన్నారు. పరిస్థితి గంభీరంగా ఉన్నా చెక్కు చెదరని విశ్వాసంతో ఉన్న ఈ ఉద్యోగులకు త్వరలో మంచిరోజులు రావాలని మనందరమూ ఆశిద్దాం.

0 comments:

Post a Comment