పనికొచ్చే పంచతంత్రం

మాంద్యం ప్రభావం.. ఐటీ, బీపీఓ, ఆతిథ్యం.. దాదాపు అన్ని రంగాల్లోసిబ్బందిని తగ్గించుకోవడం సంస్థలకుతప్పనిసరవుతోంది. పరిస్థితిలో పనిలో పోటీపడాలి. ఆత్మవిశ్వాసంతో అడుగేయాలి. ఇంకెలా మెలగాలో చదవండి.

నమ్మకం, నైపుణ్యం...
రెండు లక్షణాలు ప్రతి సంస్థ పరిగణనలోకి తీసుకునే అంశాలు. జీతమే చాలా మందికి జీవితం. ఉద్యోగులే సంస్థకుకీలకం. ప్రతిభ, నైపుణ్యమున్న ఉద్యోగుల్ని సంస్థా వదులుకోదు.

నిర్దేశించిన లక్ష్యాల్ని చేరుకుంటూ మంచి మార్కులు స్కోరు చేయండి.

ఎప్పటికప్పుడు అప్డేట్‌...
ప్రపంచం వేగంగా మారుతోంది. సాంకేతికత విస్తరిస్తోంది. మీ పనితీరులో జోరు పెరిగేలా నైపుణ్యాలు పెంచుకోండి. నిత్యం అప్‌డేట్‌ అవడం తప్పనిసరి.

చురుకు, చొరవ...
పనులు అప్పగించాక చేయడం మామూలే. సంస్థ అవసరాలు తెలుసుకుని, మీ అంతట మీరు చొరవ చూపడం, కొత్త బాధ్యతల స్వీకరణకు సిద్ధం కావడం సమ్‌థింగ్‌ స్పెషల్‌.శ్రద్ధ, నైతిక విలువలు, పనులు సమయానికి పూర్తిచేయడం, క్రమశిక్షణ, సానుకూల దృక్పథం వంటి లక్షణాలు ప్రతి ఉద్యోగిలో ఉండాలని యాజమాన్యం కోరుకుటుంది. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని నడుచుకోండి.

అపోహల్లో పడిపోవడం...
అత్యంత అనర్థ దాయకం. 'ఆ పని చేయలేనేమో'... 'నా గురించి ఏమనుకుంటున్నారో'... 'పింక్‌ స్లిప్‌ ఇచ్చే వారి జాబితాలో నేనూ ఉన్నానేమో'... వంటి భయాలను మనసులోకి రానివ్వకండి. అది మీ పనితీరుపై దుష్ప్రభావం చూపిస్తుంది.

పారదర్శకత తప్పకుండా...
అనుసరించాల్సిన పంథా. పని వేళల పట్ల అయిష్టత, బాధ్యతల పట్ల విముఖత వంటివి మనసులో ఉంటే పై అధికారుల దృష్టికి తెండి. నిర్ణయం వారికే వదలండి. ముందొకటి, వెనకొకటి తరహా సరైనది కాదు.

0 comments:

Post a Comment