బ్యాంకు ఉద్యోగాలు...

2009-10 సంవత్సర కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు దాదాపు ముప్పయ్వేల మందిని నియమించుకోబోతున్నట్లుఇన్స్టిట్యూట్ఆఫ్బ్యాంకింగ్పర్సనల్సెలెక్షన్తెలిపింది. ఉద్యోగాలు చేయాలనుకునేవారికి సబ్జెక్టులో పట్టుతోపాటుకమ్యూనికేషన్స్కిల్స్చాలా అవసరం.
యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ బ్యాంక్‌లు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు విడుదల చేశాయి. కోల్‌కత్తా కేంద్రంగా నడిచే యుబిఐ 900 ప్రొబేషనరీ ఆఫీసర్లు, 500 క్లర్కుల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఇవి కాకుండా 100 స్పెషలిస్టు ఆఫీసర్ల ఉద్యోగాల కోసం కూడా నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఇండియన్‌ బ్యాంకు కూడా ఈ సంవత్సరం 700 క్లర్కు ఉద్యోగాలను భర్తీ చేయనుంది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే ఆంధ్రాబ్యాంక్‌ 550 క్లర్కు ఉద్యోగాల భర్తీకోసం సన్నాహాలు చేస్తోంది. ఇది కాకుండా 295 ప్రొబేషనరీ ఆఫీసర్లు, 150 ఇతర కేటగిరీల్లోని ఆఫీసర్ల ఉద్యోగాలు కూడా భర్తీకి చేయనుంది.

ఇవి కాకుండా చాలా బ్యాంకుల నోటిఫికేషన్లు ఇటీవలి కాలంలో వెలువడ్డాయి, ఇంకా వెలువడుతున్నాయి. ఈ నోటిపికేషన్ల కోసం రెగ్యులర్‌గా ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌ పత్రిక చూస్తూ ఉండండి. చాలా కంపెనీలు నైపుణ్యంగల తమ ఉద్యోగులకు పింక్‌ స్లిప్‌ఇచ్చి బయటకు పంపిస్తుంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రం వేల మందిని నియమించుకుంటున్నాయి. అందుకే ఈ ఉద్యోగం సంపాదించడానికి కావాల్సిన అర్హతలు, లక్షణాలు పెంపొందిచుకోండి.

ఆంధ్రజ్యోతి, 8-6-09


2 comments: