విద్యారంగంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఉద్యోగ అవకాశాలను దృష్టిలో ఉంచుకుని విద్యాసంస్థలు వివిధ రకాలకోర్సులను నిర్వహిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా వివిధ నగరాలలో యానిమేషన్ కోర్సులు ఉన్నప్పటికీ, బెంగుళూరులోనియానిమేషన్ ట్రైనింగ్ సెంటర్లపై పలువురు మక్కువ చూపుతున్నారు.
శిక్షణా సంస్థలలో విజ్‌టూన్జ్ చెప్పుకోతగ్గది. కార్టూన్లు, యానిమేటెడ్ ఫిల్మ్‌లు రూపొందించడానికి అవసరమైన శిక్షణ కల్పించడంలో ఇది పేరుపొందింది. ట్రెడిషనల్, త్రీడీ, ఫ్లాష్ వంటి అంశాలతో శిక్షణ కల్పిస్తున్నది. ఈ సంస్థకు అనుబంధంగా ఉన్న క్రిస్టల్ డ్రీమ్స్ శిక్షణ పూర్తి చేసినవారికి ఉద్యోగాలు కల్పించడానికి కృషి చేస్తోంది. విజ్‌టూన్జ్‌లో శిక్షణ పొందగోరేవారు విజ్‌టూన్జ్ యానిమేషన్ అకాడమీ, ఫోన్ 09341683330 లో సంప్రదించవచ్చు. ఇ-మెయిల్ info@ wiztoonz.com, వివరాలకు సంస్థ వెబ్‌సైట్ www.wiztoolz.com నందు లభిస్తాయి.
ఆంధ్రజ్యోతి, తేది: 8-6-09



0 comments:
Post a Comment