మీరు జాబ్ కోసం ఇంటర్వ్యూకు వెళుతున్నారా!
అయితే మీరు కొన్ని టిప్స్ తెలుసుకోవాల్సిందే...
- మీకు ఇంటర్వ్యూ నిర్వహించే కంపెనీ చిరునామాను స్పష్టంగా తెలుసుకోండి. ఒక రోజు ముందే ఈ సమాచారాన్ని సేకరిస్తే.. మీపై ఒత్తిడి ఉండదు.
- ఇంటర్వ్యూకు ఏ మాత్రం ఆలస్యంగా వెళ్లకండి. హడావుడిగా వెళితే ఒత్తిడి పెరుగుతుంది. మనసు కుదుటగా ఉండదు. మీ సమాధానాలలో తప్పులు దొర్లే ప్రమాదం ఉంది.
- ఇన్‌సర్ట్ చేసుకోకుండా వెళ్లకండి. ఇన్‌ఫార్మల్ దుస్తులను అసలే వేసుకోకండి. అవసరమైన ఉద్యోగాలకు టై తప్పనిసరి. బ్లాక్ షూ ధరించండి.
- ఇంటర్వ్యూకు ముందుగానే సర్టిఫికెట్లను సర్దుకోండి. కొన్ని జిరాక్స్ కాపీలు దగ్గర ఉంచుకోండి. ఒక పెన్ను, ప్యాకెట్ నోట్ బుక్ పెట్టుకోండి. కాల్‌లెటర్ తీసుకుపోవడం మరిచిపోకండి.
- కంపెనీకి వెళ్లాక.. ఒకసారి రీఫ్రెష్ అవ్వండి. తలదువ్వుకొని దుస్తులు సరిచేసుకోండి. రెండు గ్లాసుల మంచినీళ్లు తాగండి.
- మీరు వెళ్లిన కంపెనీలో మీ మిత్రుడు ఉంటే.. ఇంటర్వ్యూ పూర్తి కాకుండానే ముచ్చట్లు పెట్టుకోకండి. ఉద్యోగం వస్తుందో రాదోనన్న సందిగ్ధంలోకి వెళ్లకండి.
- ఫలానా ఉద్యోగానికి ఇంటర్వ్యూకు వచ్చినట్లు.. ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్‌కు చెప్పండి. ఆమె అడిగిన ప్రాథమిక వివరాలను తడబాటు లేకుండా చెప్పండి.
- కంపెనీలకు వెళ్లే హడావుడిలో సెల్‌ఫోన్ స్విచాప్ చేయకపోతే.. ఇంటర్వ్యూ సభ్యులు తీవ్రంగా పరిగణిస్తారు. ఇంటర్వ్యూ సమయమంతా బాగా పూర్తయినా.. ఆఖర్న ఫోన్ రింగ్ వినిపిస్తే మాత్రం.. మీకు నష్టమే.
- ఇంటర్వ్యూ పూర్తయ్యాక.. ఫలితం కోసం ఆరా తీయకండి. మీ వివరాలన్నీ రెజ్యూమెలో భద్రంగా ఉంటాయి. మీరు సెలెక్ట్ అయితే కంపెనీ తప్పక సమాచారం చేరవేస్తుంది.



0 comments:
Post a Comment