స్టాక్మార్కెట్లో అత్యధికంగా ఇన్వెస్ట్ చేసే రాష్ట్రాలలో మహారాష్ట్ర, గుజరాత్ ముందున్నాయి. ఒకప్పుడు సంపన్న వర్గాలకేపరిమితమైన ఈ పెట్టుబడులు.. రానురాను విస్తరిస్తున్నాయి. షేర్ల లావాదేవీలలో తాజాగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ఊపందుకున్నాయి. మదుపరుల చైతన్యం కూడా బాగా పెరిగింది. ఈ జోరుతో రానున్న 5 ఏళ్ల్లలోసెన్సెక్స్ 30 వేలు దాటినా ఆశ్చర్యం లేదు. అమెరికాకు చెందిన ఒక క్యాపిటల్ రీసెర్చ్ కంపెనీ ప్రకారం 15 ఏళ్లలో సెన్సెక్స్లక్ష పాయింట్లకు చేరుకుంటుందని అంచనా. ఈ గణాంకాలను పరిశీలిస్తే క్యాపిటల్, ఫైనాన్సియల్ మార్కెట్‌లో ఉద్యోగఅవకాశాలు పుష్కలం. ఇది వరకు ఐటీ బూమ్ను తలదన్నే రీతిలో ఫైనాన్సియల్ రంగం దూసుకెళ్లడం ఖాయం.
బ్యాన్కులకు కొత్త శోభ
ఇప్పటికే హైదరాబాద్‌లో పేరున్న కంపెనీలు, బ్యాంకులు, బీపీవో సంస్థలు ఫైనాన్సియల్ సర్వీసులను అందిస్తున్నాయి. స్టాక్‌మార్కెట్ బ్రోకరింగ్ కంపెనీల సంఖ్య బాగా పెరిగింది. మ్యూచువల్ ఫండ్ సంస్థలు కొత్త శాఖలను ఏర్పాటు చేస్తున్నాయి. పలు పేరొందిన బ్యాంకులు క్యాపిటల్ మార్కెట్ సర్వీసులను అందించేందుకు పోటీ పడుతున్నాయి.
షేర్ల కొనుగోలు లావాదేవీలలో బ్రోకింగ్ కమీషన్ల విలువ వేల కోట్లు. ఇప్పటికే ఎలాగూ బ్యాంకులు ఆర్థికసేవల రంగంలో ఉన్నాయి కనుక, క్యాపిటల్ సర్వీసులను సులువుగా అందించే సౌలభ్యం ఉంది. దీంతో బ్యాంకింగ్ రంగం ఫైనాన్సియల్ సర్వీసుల ద్వారా మరింత ఆదాయాన్ని సమకూర్చుకొనేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి. ఇందులో క్యాపిటల్ మార్కెట్ సేవల ఆదాయమే ఎక్కువ భాగం కాబోతుంది.
కార్పొరేట్ కంపెనీలలో
వీటితోపాటు ఫైనాన్సియల్ రీసెర్చ్ ఓరియెంటెడ్, ఫైనాన్సియల్ డేటా ప్రొవైడింగ్ కంపెనీల సంఖ్య పెరుగుతోంది. సాఫ్ట్‌వేర్ కంపెనీలు కూడా ఫైనాన్సియల్ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాయి. హైదరాబాద్‌లో విప్రో, హెచ్‌సీఎల్, బ్రిగేడ్, క్యాపిటల్ ఐక్యూ, జెన్‌పాక్ట్, ఏడీపీ, ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్, డిలయిట్, జీఈ, బ్యాంక్ ఆఫ్ అమెరికా తదితర పేరున్న సంస్థలు ఈ కోవలోనే సేవలు అందిస్తున్నాయి.
ఈ సంస్థలలో ప్రవేశించేందుకు బీకాం, ఎంకాం, సీఏ, ఎంబీఏ ఫైనాన్స్ పూర్తి చేసిన అభ్యర్థులకు అవకాశం లభిస్తోంది. ఎంబీఏ ఫైనాన్స్ అభ్యర్థులు ఎన్‌సీఎఫ్‌ఎం, ఆంఫీ సర్టిఫికెట్లు సంపాదిస్తే మెరుగైన ఉద్యోగాలు లభిస్తాయి. ఈ కోర్సులకు హైదరాబాద్‌లోని ఎన్‌సీఎఫ్‌ఎం అకాడమీలో శిక్షణ ఇస్తున్నారు. అభ్యర్థులకు సబ్జెక్ట్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్క్, ఇంగ్లిష్ సామర్థ్యం ఉంటే.. ప్రారంభంలోనే ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తాయి. క్యాపిటల్ మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం రానున్న పదేళ్లలో ఈ రంగంలో పది లక్షల ఉద్యోగాలు భర్తీ కానున్నాయి.
ఎలాంటి ఉద్యోగాలు..
ఫైనాన్సియల్ మార్కెట్‌లో అభ్యర్థి ప్రతిభాసామర్థ్యాలను బట్టి పలు రకాల ఉద్యోగాలు ఉన్నాయి. టెర్మినల్ ఆపరేటర్, రిపోర్ట్ జనరేటర్స్, స్టాక్ బ్రోకింగ్ డీలర్స్, ఫైనాన్సియల్ ఎనలిస్ట్, బిజినెస్ ఎనలిస్ట్, ఫైనాన్సియల్ ప్రోడక్ట్ సెల్లర్స్, స్టాక్ ఎనలిస్ట్, ఫండ్ మేనేజర్స్, ప్రాసెస్ అసోసియేట్, డొమైన్ ఎక్స్‌పర్ట్ తదితర హోదాల్లో నియామకాలు ఉంటాయి. ఇప్పుడున్న సంక్షోభంలో కూడా బీకాం, ఎంకాం లేదా ఎంబీఏ ఫైనాన్స్ పూర్తి చేసి ఎన్‌సీఎఫ్‌ఎం సర్టిఫికెట్ సంపాదిస్తే.. తప్పకుండా మంచి ఉద్యోగం లభిస్తుంది. భవిష్యత్తులో క్యాపిటల్ సర్వీసుల రంగానికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని.. ఇప్పటి నుంచే కృషి చేస్తే మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్లకు ఢోకా ఉండదు.
పదిలక్షల ఉద్యోగాలు మీ కోసం
ఆంధ్రజ్యోతి, తేది: 8-6-09
Subscribe to:
Post Comments (Atom)



0 comments:
Post a Comment