ఉద్యోగం మానేస్తున్నారా..? ఒక్క నిమిషం..!

కారణం లేకుండా ఎవరైనా ఉద్యోగం మానేస్తారనుకుంటే పొరపాటు. ఇంతకూ మీరు ఉద్యోగం మానేసేందుకు ఎలాంటికారణముందో మీ సహోద్యోగులతో ముచ్చటించండి.

- పని ఒత్తిడి, బాస్తో పడకపోవడం, పనివేళలు పాటించకపోవడం.. సహజంగా కారణాలే ఉద్యోగులు చెబుతుంటారు. మీరు ఇలాంటి కారణంతోనే మానేస్తున్నారా..?

అయితే, ప్రస్తుతం మీరు పనిచేస్తున్న కంపెనీలో నెలకొన్న వాతవరణం, కొత్త కంపెనీలో కూడా లేదని మీకు ఖచ్చితంగా తెలుసా..? భవిష్యత్తులో తిరిగి ఇలాంటి సమస్యలే ఎదురుకావు అనుకుంటున్నారా..? అయితే మీ అంచనాలు కరెక్టు కాదు.

- కంపెనీ అంటేనే వ్యాపారత్మకం. నిర్దేశిత సమయానికి ఫలానా పని పూర్తిచేయాలన్న లక్ష్యం ఉంటుంది. ఆ ప్రక్రియలో సహజంగానే మీపై ఒత్తిడి ఉంటుంది. దీనిని అర్థం చేసుకోకపోతే మీరు ఎక్కడా పని చేయలేరు.

- ఆఫీసు పనివేళలు సరిగా పాటించకపోయినా, పనిలో తరచూ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించినా, నాణ్యత లేకపోయినా బాస్‌ మందలిస్తాడు. ఇంతకంటే భిన్నంగా మరో కంపెనీలో ఉంటుందనుకుంటే మీ తప్పే అవుతుంది.

- మీకున్న అనుభవం తక్కువే అయినా, అధిక వేతనాల కోసం కంపెనీ కాంట్రాక్టు గడువు తీరకుండానే వెళ్లడం ఉత్తమం కాదు. మీరు ఎలాంటి కమిట్‌మెంట్‌లు ఉన్నా సానుకూలం పూర్తి చేసుకోవడమే మంచిది.

0 comments:

Post a Comment