ఔషద విక్రయ నిపుణులకు మూడు సూత్రాలు!

ప్రస్తుత ఆర్ధిక సంక్షోభకాలంలో అసలు సిసలు సవాలు మార్కెటింగ్ సిబ్బందిదు. వినియోగదారులను ఒప్పించడానికి మునపటిక్నా ఎక్కువే శ్రమ పడాల్సి వస్తుంది. అందులోనూ ఔషదాల మార్కెటింగ్ మరింత క్లిష్టమైన వృత్తిగా మారింది. వాస్తవానికి ఈ వృత్తి ఆకర్షణీయంగా ఉంటుంది. లక్ష్యాలు సాధించిన సిబ్బందికి ప్రోత్సాహకాలు బాగుంటాయి. ఇప్పుడు కొత్త గరిష్ఠ ధర విధానం అమలులో ఉండడంతో మందుల దుకాణాల వారిని ఒప్పించడానికి కొంత శ్రమ పడక తప్పడం లేదు. అన్ని పన్నులతో కలిపి గరిష్ఠధరను విక్రయించడంతో ముద్రించిన ధరకంటే ఎక్కువ ధరకు విక్రయించడానికి వారికి అవకాశం దొరకడం లేదు. దీంతో ఏ కంపెనీ ఎక్కువ కమిషన్ ిస్తే వారి దగ్గరే మందులు కొనే పరిస్థితి ఇప్పుడు ఉంది.
ఈ పరిస్థితుల్లో మార్కెటింగ్ విభాగాలను పరిపుష్ఠం చేసుకునే దిశగా కంపెనీలు పయనిస్తున్నాయి. రూ. 500 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీకి 700 నుంచి 800 మార్కెటింగ్ / సేల్స్ సబ్బంది అవసరం అవుతారు. సామర్ధ్యం, నైపుణ్యం ఉన్నవారికోసం కంపెనీలు అన్నేషిస్తున్నాయి. గతంలో తప్పనిసరిగా 60 రోజుల శిక్షణ ఉండేది. ఇప్పుడు దాన్ని కుదించారు. సాధారణ ఔషదాలకు 15 నుంచి 35 రోజుల మధ్యే శిక్షణ ఉంటోంది. ప్రత్యేక ఔషదాలకు మాత్రమే 60 రోజుల పాటు తప్పనిసరి శిక్షణ ఉంటుంది. కాబట్టి కొత్తగా చేరిన వారు తమను తామే సానబెట్టుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. ఆకర్షణీయమైన జీతభత్యాలు లభించే ఈ వృత్తిలో ప్రస్తుత కాలంలో రాణించాలంటే స్వతాహాగా ఉన్న నైపుణ్యాలనకు మరింత పదును పెట్టుకోవాలని, ప్రతి అంశంలోనూ జాగ్రత్తగా అడుగులు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వృత్తిలో కొత్తగా చేరిన వారు అవగాహన పెంచుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి.
సమయపాలన: ఈ విషయంలో చాలా కచ్చితంగా ఉండాలి. వైద్యులను కాని, నిల్వదారులను (స్టాకిస్టు) కాని కలుస్తామన్న సమయానికి కచ్చితంగా చేరుకోవాలి. అక్కడ వారు తీరిక లేకుండా ఉంటే వేచి ఉండడానికి కూడా సిద్ధపడి వెళ్లాలి. సాధారణంగా సేల్స్ సిబ్బంది పని వేళలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 10 వరకు ఉంటాయి. వైద్యులను కలవడానికి నువైన సమయాలు అవి. ఒక్కొక్కరిని నెలలో మూడు సార్లు కలిసేలా ప్రణాళిక చేసుకోవాలి.
ఆహార్యం: ఫార్మాసేల్స్ / మెడికల్ రెప్(ఎంఆర్) వృత్తి ఆకర్షణీయంగా మారడంతో ఒక ముఖ్యమైన అంశం ఆ నిపుణుల ఆహార్యమే. హుందాగా కనిపించే దుస్తులు, టై, పాలిష్ చేసిన ఘూ, చేతిలో చక్కటి ఎగ్జిక్యూటివ్ బ్యాగ్తో కనిపించే వారిని చూస్తే ఎవరికైనా ఆ వృత్తిలో చేరాలనిపిస్తుంది. వైద్యులను కలవడం కోసం బయట వేచిచూసేటప్పుడు ఎంఆర్లు ఒకరి ఆహార్యాన్ని మరొకరు పరిశీలించడం సర్వాధారణ విషయమే. కొంతమందికి ఒక్కో జతను రెండు రోజుల పాటు వేసుకునే అలవాటు ఉంటుంది. ఈ వృత్తితో అటువంటి అలవాటుకు స్వస్తి చెప్పాల్సిందే. ప్రతి రోజూ ఘూకు పాలిష్ చేసుకోవాల్సిందే. గడ్డం గీసుకోవాల్సిందే. ఈ విషయాల్లో రాజీ పడితే వృత్తిలో వెనుకబడినట్లే. రెండుచక్రాల బండిపై ఎక్కువగా తిరగాల్సి ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు తాజాగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆత్మవిశ్వాసం: వైద్యులతో మాట్లాడేటప్పుడు హుందాగా, వినయంగా ఉండడం ఎంతముఖ్యమో ఆత్మవిశ్వాసమూ అంతే ముఖ్యం. ఆకట్టుకునే ఆహార్యం మీ సొంతమవుతుంది. మిగిలిన సగం.. భావవ్యక్తీకరణ నైపుణ్యాలు, విషయ పరిగ్జ్నానంపై ఆధారపడి ఉంటుంది. విషయ పరిగ్జ్నానం బాగా ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఆంగ్లంలో దారాళంగా మాట్లాడగల్లేలా సాధన చేయండి. గతంలో కంటే కూడా ఇప్పుడు వైద్యులు ఉత్పత్తిపై మరింత లోతుగా ప్రశ్నలు గుప్పిస్తున్నారు. పోటీ ఉత్పత్తి కంటే మీ ఉత్పత్తి మెరుగైన క్లినికల్ ట్రైల్స్ వివరాలనూ వైద్యులు అడుగుతున్నారు. సరిగా పరిక్షలు నిర్వహించి చూసిందీ లేనిదీ నిర్ధారించుకుంటున్నారు. ఈ విషయాలన్నింటిపైనా అవగాహన అవసరం.

0 comments:

Post a Comment