మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా? మీ కెరీర్లో ఎదుగుదల, .జీతంలో వృద్ధి ఉండాలంటే కొన్ని మెళకువలు పాటించడం తప్పనిసరి.
- స్నేహాలు పెంచుకోవాలి...
- మీ గురించి పాజిటివ్గా మాట్లాడేవారితో స్నేహం పెంచుకోండి. ఇరువురి అభిప్రాయాలను పరస్పరం పంచుకోండి. వారు మీకు భిన్నమైన డిపార్ట్మెంట్కు చెందినవారైతే మంచిది. ఎందుకంటే వారు మీ అవకాశాలకు గండికొట్టేవారు కాకూడదు కదా!
- బాస్కు మంచి విషయాలే చెప్పాలి...
- మీ బాస్తో మంచి విషయాలే చెప్పడం ద్వారా అభిమానం చూరగొనాలి. బాస్ మీతో మాట్లాడేందుకు ఆసక్తి ప్రదర్శించేలా మీ మాటతీరు ఉండాలి.
- నచ్చేవిధంగా నడుచుకోవాలి.
- బాస్కు నచ్చినదేమిటో తెలుసుకోగలగాలి. అతనికి నచ్చేనవిధంగా అనుకరించాలి. సాధారణంగా బాస్లు తమను ఇష్టపడేవారిపై అభిమానం చూపిస్తారు.
- బహుమతులు గెలుచుకోండి...
- మీ వృత్తికి సంబంధించి ఏ సంస్థవారు అవార్డులిచ్చినా దరఖాస్తు చేసుకోండి. మీకు అవార్డు వస్తే పనిచేసే సంస్థ సంతోషిస్తుంది. బాస్ దృష్టిలోనూ పడతారు.
- సరైన స్థానాన్ని ఎంచుకోండి...
- బాస్తో కలసి ఉన్నప్పుడు మిమ్మల్ని ఫోకస్ చేసుకోవాలనుకుంటే సమావేశాల్లో అతని పక్కసీట్లో గాని, ఎదురుగా గాని కూర్చోరాదు. బాస్ దృష్టికి అందేవిధంగా దూరంగా కూర్చోవాలి.
- నలుగురితో మంచి సంబంధాలు కలిగి ఉండటంతోపాటు మీకున్న ఇమేజ్నూ కాపాడుకోవాలి. పరిచయస్తులతో రాత్రిపూట పార్టీకి వెళ్లినా మర్నాడు ఉదయం ఆ ప్రభావం మీ పనిమీద పడరాదు. బాస్ దృష్టిలో మీ ఇమేజ్ ఎప్పుడూ క్లీన్గా ఉండాలి మరి!



0 comments:
Post a Comment