కంపెనీలు ఎలాంటి వాళ్లకు ప్రాధాన్యం ఇస్తాయి?
కొంతమంది విద్యార్ధులకు డిష్టింక్షన్ వస్తుంది. మరికొందమందికి ఫస్ట్ క్లాస్ వస్తుంది. ఇంకొంతమంది సాధారణ మార్కులతో పాసవుతారు. ఎందుకు?! దీనికి ఒకటే కారణం.. కష్టపడే వాళ్లకే మంచి మారు్కలు వస్తాయి. కంపెన్టీల్లోనూ అలాగే జరుగుతుంది. సామర్ధ్యం, కష్టపడే తత్వం ఉన్నవాళ్లే నిలదొక్కుకుంటారు. ఇండివిడ్యువల్ కాంపిటెన్సీ, కమిట్మెంట్, ప్లెకి్సబిలిటీ, హార్డ్వర్క్... ఇవే ఉద్యోగిని ఉన్నతస్థాయికి తీసుకెళ్లాయి. నేర్చుకోవాలనే తపన ఉండాలి. మీకు సీ++ బాగా వచ్చు. కాని అందులో అవకాశాలు లేవు. ఇప్పుడు జావాకు మాత్రమే అవకాలున్నాయి. అలాంటప్పుడు అది నేర్చుకుంటేనే పరిశ్రమలో మనగలుగుతాం. జావాలో అవకాశాలున్నాయి. మేం జావా నేర్పిస్తాం. ఫలానా చోటుకి మిమ్మల్ని పంపిస్తాం... అక్కడకు వెళ్లారా?? అన్నప్పుడు! మీరు రెండు విధాలైన సమాధానాలు చెప్పొచ్చు. ఒకటి... జావా నేర్చుకొని... అప్పగించిన పని చేస్తానని ఆత్మవిశ్వాసంతో చెప్పడం, రెండు... లేదు...! నేను సీ++ లోనే ఉంటా... అనడం! కచ్చితంగా మొదటి సమాధానం చెప్పిన వ్యక్తికే అవకాశాలు ఎక్కువ!!



0 comments:
Post a Comment