ఉద్యోగం అంటే బాధ్యత..
తను ఉత్పత్తి చేసిన వ స్తువు లేదా సేవను వినియోగదారుడికి అందించటం అనే వ్యాపార వ్యవస్థలో ఒక బాధ్యతను ఉద్యోగంగా ఇస్తారు. ప్రతి ఉద్యోగం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మనుష్యుల జీవితాల మీద, తోటి ఉద్యోగుల పనితనం మీద ప్రభావం చూపిస్తుంది. ఉద్యోగం అనే బాధ్యతను సరిగ్గా నిర్వహించకపోతే దాని పరిణామాలు ఒక్కోసారి సుదీర్ఘంగా ఉంటాయి.
ఇంటర్వ్యూ అనే చిన్న పరీక్ష నుంచి ఏదో ఒక రకంగా గట్టెక్కి ఉద్యోగం సంపాదించుకోవడం కాకుండా.. నా పనితనం ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందని ప్రశ్నించుకోవాలి. ఒక ఔషధ తయారీ సంస్థలో చిన్న ఉద్యోగ నిర్లక్ష్యం ఎన్నో ప్రాణాలు తీస్తుంది. అన్ని ఉద్యోగాల్లోనూ ఈ కోణం ఉంటుంది. దీన్నే 'టాస్క్ సిగ్నిఫికెన్స్' అంటారు. ఇది అర్థమైతే ఇంటర్వ్యూలకు సన్నద్ధం కావడం కూడా మరింత అర్థవంతంగా ఉంటుంది.
ఇంటర్వ్యూ పట్ల నిర్లక్ష్యం తగదు..
ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలు అడుగుతారు. మనం కొన్నింటికి జవాబులు చెబితే చాలు. అన్నీ చెప్పకపోయినా పర్వాలేదు. జవాబులు సరిగా తెలియకపోయినా, ఊహించైనా చెప్పిచూద్దాం. కొన్ని జవాబులు కరెక్టైనా చాలు. ఇంటర్వ్యూలో నెగ్గుతాం.
మొదటి ఐదున్నర నిమిషాలే నిర్ణయాత్మకం
ఒక అధ్యయనం ప్రకారం ఇంటర్వ్యూలో మొదటి ఐదున్నర నిమిషాలలో ఒక అభ్యర్థిని ఎంపిక చేసుకోవాలా..? వద్దా..? అనే నిర్ణయం జరిగిపోతుంది. మిగిలిన ఇంటర్వ్యూ ప్రభావం చాలాసార్లు నామమాత్రంగా ఉంటుంది. అలాంటి కీలక సమయంలో.. ఎ) రెజ్యూమె తయారు చేసిన విధానం బి) అభ్యర్థి సమాధానాల్లో కనిపించే సాధికారత సి) ఎంచుకున్న రంగం, అంశం పట్ల ఉన్న ఆసక్తి, నిబద్ధత పరిశీలిస్తారు. దాదాపు అంతటితోనే ఎంపిక పూర్తయిపోతుంది.




0 comments:
Post a Comment