గ్జ్నాపకాలతో ఒత్తిడి మాయం

అదే టేబుల్.. అదే కంప్యూటర్... తరగని పని.. పెరిగిన ఒత్తిడి.. ఆఫీస్ ఎగ్గొట్టి కాస్త రిలాక్స్ అవుదామంటే పులి గాండ్రింపులా నో లీవ్స్అనే బాస్..! ఎక్కడికైనా పారిపోదామనిపిస్తుంది. అయితే, ఎప్పుడో వెళ్లిన టూర్ గ్జ్నాపకాలను భద్రంగా దాచుకుంటే ఒత్తిడి మటుమాయం. ఆ చిట్టి చిట్కాలిక్కడ చూడండి.

ఫోన్ ఆగిపోవాలి..

బిజీ బిజీ కాల్స్తో విసుగెత్తించే మీ ఫోన్ను కాసేపు స్విచ్ ఆఫ్ చేయండి. లంచ్ను హడావుడిగా ఆఫీస్లోనే ముగించకుండా బయటకెళ్లి భోజనం చేయండి. మీరెందుకు ఒత్తిడిగా ఫీల్ అవుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. టెన్షన్కు కారణమవుతున్న సమస్యనుంచి, మీ ఆఫీస్నుంచి కాసేపు దూరంగా ఉండండి. మనసుకు, శరీరానికి కాస్త హుషారునివ్వండి. విశ్రాంతిగా, ఉత్సాహంగా గడిపేందుకు కొన్ని నిమిషాలైనా ప్లాన్ చేసుకోండి.

ఫోటోలుంచే చాలు..

గతంలో మీరు ఎంజాయ్ చేసిన టూర్ ఫోటోలను మీరు పనిచేసే సిస్టమ్లో లోడ్ చేసుకోండి. మీరు కాస్త టెన్షన్లో ఉన్నప్పుడు ఆ ఫోటోలు చూడండి. మీరు ఆనందించిన క్షణాలనవి గుర్తుచేస్తాయి. ఆ ఫోటోల మాటున టూర్ అనుభూతులు దాగుంటాయి కనుక వాటిని చూసినపుడు కొన్ని క్షణాలు అక్కడికెళ్లపోయి రిలాక్సవుతారు.

పునఃస్మరణ...

గతంలో మీకు సంతోషాన్ని మిగిల్చిన విశేషాలను గుర్తు చేసుకోవడం అద్భుతంగా ఉంటుంది. తోటివారితో అప్పటి అనుభూతులను, భావాలను పంచుకోవడం ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆ మధుర క్షణాల్లో మీతో పాటు ఉన్న వారితో అప్పటి

సంగతులు ముచ్చటిస్తే, నెమరేసుకుంటే మనసు హుషారవుతుంది. ఇలాంటి డి్కషన్స్తో కొత్త సంతోషం మీ సొంతం, అదీగాక, అప్పటి సంతోషం రెండింతలవుతుంది.

సహజ వాతావరణంలో..

రెగ్యులర్ ఆఫీస్ వాతావరణానికి భిన్నంగా, బోర్ కొట్టే ఏసి గాలినుంచి కాస్త విముక్తి లభించేది ఆరుబయట ప్రదేశంలోనే. అయితే ఎప్పుడనుకుంటే అప్పుడు అలా వెళ్లిపోవడం కుదరదు కనుక, ఇలాంటి సహజ వాతావరణాన్ని గుర్తు చేసేలా ఆఫీసులో దేన్నైనా ఏర్పాటు చేసుకోవాలి. లేదా మనసులోనే ఊహించుకోవాలి. ఉదయించే సూర్యుడు, కదిలే గాలి, సెలయేటిలో మీరు తాకిన నీరు, ప్రతీదీ అద్భుతమైన అనుభవమే, ఇలాంటి ఆలోచనలను నెమరు వేసుకోవటం వల్ల మనసు నెమ్మదిస్తుంది.

ప్రకృతి పలికే సంగీతం..

వెకేషన్లో విమ్ములను తేలియాడించిన సముద్రపు అలల సవ్వడి, పక్షుల అరుపులు ఒక్కటేమిటి మీ టూర్లో మిమ్ములను థ్రిల్ చేసిన ప్రతీ సౌండ్ మీ మనస్సులో చెరగని ముద్రవేసి ఉంటుంది. ప్రకృతి వినిపించే ఆ అద్భుత సంగీతాన్ని ఒకసారి గుర్తుచేసుకోండి. లయబద్ధమైన సహజ సంగీతాల రిథమ్ మిమ్ములను ఆనంద డోలికల్లో తేలియాడిస్తుంది.

దీర్ఘ శ్వాస...

శరీరాన్ని నిటారుగా నిలబెట్టి, రెండు కళ్లు మూసుకోండి. కాళ్లు నేలపై ఆన్చి, ముక్కుతో గుండెలనిండా గాలి పీల్చండి. ఇలా ఐదు పది నిమిషాల పాటు చేయండి. ఛాతి కండరాలకు కాస్త విశ్రాంతి దొరుకుతుంది. మీ ఆలోచనలు అలర్టై విశ్రాంతి తీసుకోవడానికి మనస్సు సిద్ధమవుతుంది.

అరుదైన వస్తువులు..

టూర్ నుంచి మీరు తెచ్చుకున్న సెంట్లను, భీచ్లో శరీరానికి రాసుకున్న సన్స్కీన్ లోషన్, సేకరించిన వనమూలికలు, అరుదైన వస్తువులను మీ ఆఫీస్ టేబుల్ సారుగులో జాగ్రత్త చేసుకోండి. ఇలాంటి వస్తువులను చూడడంతో మొదటిసారి వీటిని చూసినపుడు కలిగిన అనుభూతి కల్గుతుంది. మనసులో నిక్లిప్తమైన గుర్తులు, ఆలోచనలు, సువాసనలకు సంబందించిన సృ్తులు ఎన్ని రోజులవైనప్పటికి ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఆ సంతోషం తిరిగి సొంతమౌతుంది. మీరు ఎంత టెన్షన్లో ఉన్నా ఈ చిన్న చిన్న గ్జ్నాపకాలు కొత్త ఉత్సాహాన్నిస్తాయి. తిరిగి పని చేయడానికి టెన్షన్ ఫ్రీగా సిద్ధంచేస్తాయి.


0 comments:

Post a Comment