మనసున్న మహీగ్రాఫిక్స్‌

సమస్య ఒకరిదే అయినా దాని యొక్క పపిష్కారం అందరికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో మహిగ్రాఫిక్స్అనే ఫోరమ్నుస్టాట్చేసిన ఫోరమ్సభ్యులకు నా అభినందనలు మరియు థ్యాంక్స్‌ ఈ విధంగా తెలుపుకుంటున్నాను. తెలుగు సైట్లలో నాకు నచ్చిన రెండవ సైట్‌ మహీగ్రాఫిక్స్‌. నాకు ఫస్ట్‌ నుంచి తెలిసింది కంప్యూటర్‌ ఎరా అయినప్పటికి నా అనుభవాలను అందరితో ఈ విధంగా పంచుకోవడానికి సహకరించింది మహిగ్రాఫిక్స్‌ మహేష్‌ గారు. ఈ ఫోరమ్‌లో సమస్యలకు పరిష్కారమే కాకుండా ప్రతిఒక్కరు స్నేహంగా, అప్యాయంగా పలకరించడం ఆనందించదగ్గ విషయం. ఈ పోస్ట్‌ ద్వారా నేను చెప్పదలచుకుంది ఏమనగా మహిగ్రాఫిక్స్‌ ను మీరు సందర్శించి మీకు తెలిసిన మరికొంత మందికి తెలియజేయాలని... నేను ఒక సభ్యునిగా భావించి నా వంతు కృషిగా, ఎంతో సంతోషంగా ఈ పోస్ట్‌ చేస్తున్నా.

మీ స్నేహితుడు

Free Web Counter

పూర్తిగా చదవటానికి క్లిక్ చేయండి...

PART TIME JOB IN YOUR CITY

మీరు మీ ప్రాంతంలోనే సాయంత్రం సమయంలో పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేసుకొనే అవకాశం. జీతం 3,000/- నుండి 5,000/- వరకు. సంప్రదించండి 9848655242
Visit Our Website : www.admark.webs.com
పూర్తిగా చదవటానికి క్లిక్ చేయండి...

అవకాశం కోసం చుస్తున్నారా?

మీరు ఇప్పటి దాకా అవకాశాల కోసం చుస్తుంటే కనుక ఇంక మీరు పని చేయనక్కర్లేదు. ATV చూస్తే చాలు.
ఎందుకంటే వరల్డ్‌ లోని అన్ని రకాల అవకాశాలను మీ ముందు ఉంచుతుంది ATV. మీరు జాబ్‌ చేస్తున్నా, జాబ్‌ కోసం ఎదురు చుస్తున్నా, ఉద్యోగ ఉన్నతి కోసం సలహాలు కావాలన్నా Atvలో JOb Centreని చూడండి. ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మరెన్నో అవకాశాలను కూడా అందిస్తుంది ATV.
పూర్తిగా చదవటానికి క్లిక్ చేయండి...

ఇంటర్వ్యూ ముఖాముఖీ... ముఖ్యమివీ!

ఉద్యోగ ప్రయత్నం అంటే... దరఖాస్తు రూపకల్పనతో పాటూ మరిన్ని ముఖ్యాంశాలను గుర్తుంచుకోవాలి. అవేంటో చూడండి.
ఫలానా రోజు పది గంటలకు ఇంటర్వ్యూ అని తెలుస్తుందిగా. ఆ రోజున ఇంటి నుంచి కాస్త త్వరగా బయలుదేరి పది నిమిషాల ముందుండండి. ట్రాఫిక్‌లో చిక్కుకోవడం, సమయం చాలదన్న హడావుడి. ఇలా చేస్తే ఇంటర్వ్యూ సమయానికి ప్రశాంతంగా ఉంటారు. ముఖంలో కంగారు కనిపించదు. ఇంటర్వ్యూ సమయంలో దిక్కులు చూస్తూ సమాధానం చెప్పకుండా.. సూటిగా చూస్తూ మాట్లాడాలి. ఆత్మవిశ్వాసంతో అది సాధ్యమే. మీరు చెప్పేవి సూటిగా, స్పష్టంగా ఎదుటి వారికి అర్థమయ్యేలా ఉండాలి. ఎలాంటి ప్రశ్నలు వేయొచ్చు, ఎలా సమాధానం చెప్పాలి అన్న కోణంలో సన్నద్ధమై వెళితే తడబాటు ఉండదు. లేదంటే.. 'వూ' 'ఆ' అంటూ ఆలోచించాల్సి వస్తుంది.
ఒక్కోసారి సంస్థ చిరునామా తెలియక వెతుకుతూ ఉంటారు. ఆ సంస్థకే ఫోన్‌ చేసి 'పలానా చోట ఉన్నా... ఇప్పుడు ఎక్కడికి రావాలి' అని అడుగుతుంటారు. ఇది సరికాదు. స్నేహితులు, తెలిసిన వారి సాయంతో ముందే చిరునామా కనుక్కోవాలి. చాలా సందర్భాల్లో మీకు వచ్చిన కాల్‌లెటర్‌లో పూర్తి చిరునామా ఉంటుంది కూడా.
తామెవరో తెలియాలనే ఉద్దేశంతో సంస్థకు ముందే ఫోన్‌చేసి చెబుతుంటారు కొందరు. దాంతో అసలైన రోజు.. 'నేను మీకు ఫోన్‌ చేశాను..' అంటూ గొప్పగా చెబుతుంటారు. ఇలాంటి పని అసలే వద్దు.
ఇంటర్వ్యూ సమయంలో సెల్‌ఫోన్‌ స్విచాఫ్‌ చేయాలి. కంపించే స్థితిలో ఉంచినా తరచూ చూసుకుంటూ... కొన్ని కాల్స్‌ మాట్లాడాలన్న ప్రయత్నం చేయడం బావుండదు. అలాగే ఫ్యాషన్లకు మరీ ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకండి.
'ఎంత జీతం కావాలి' అన్న చర్చ వచ్చినప్పుడు అసహనంగా కదలడం, గోడవైపు చూడటం... ఎక్కువ సమయం ఆలోచించడం... సరైన విధానాలు కావు. ముందే ఒక అంచనాతో ఉండి వెల్లడించాలి. అదే సమయంలో 'అంత ఇవ్వాల్సిందే... నా స్థాయికి అది తక్కువ' అన్న తరహాలో వాదనలు కూడదు.

ఈనాడు.

పూర్తిగా చదవటానికి క్లిక్ చేయండి...

స్వేచ్ఛతోనే సాధ్యం

ఆత్మ విశ్వాసంతో స్థాయికైనా ఎదగవచ్చు. దీనికి స్వేచ్ఛ అవసరం. స్వేచ్ఛ అనేది లేకపోతే ఏదీ సాధించే అవకాశం లేదు. కొద్దిగా చొరవ, కష్టపడే తత్వం ఉంటే ఎవరైనా రంగంలోనైనా అభివృద్ధి సాధించవచ్చు. ఆత్మవిశ్వాసంతో ముందడుగువేసేవారు తాము అనుకున్నది తప్పక సాధిస్తారు. వెనుకంజ వేస్తే ఎప్పటికి మార్పును సాధించలేరు. ముందు మనపై విశ్వాసాన్ని పెంచుకోవాలి. మార్పును ఆకాంక్షించే దిశగా ముందుకు సాగాలి. అప్పుడే అనుకున్న మెట్టును చేరగలుగుతాం. అందరికీ ఆదర్శప్రాయమవుతాం.

మీ స్నేహితుడు
పూర్తిగా చదవటానికి క్లిక్ చేయండి...

Most Asked Interview Questions...

మీరు ఏ జాబ్ ఇంటర్వ్యూకు వెళుతున్నారో ఆ జాబ్కి ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు వాటికి సమాధానలు ఏ విధంగా చెప్పాలి వంటి విషయాలను ఈ సైట్లో తెలుసుకోండి.
http://www.koolkampus.com/job-hunt.php పూర్తిగా చదవటానికి క్లిక్ చేయండి...